పాఠశాలల్లో పరిశుభ్రతను పాటించాలి
ABN , Publish Date - Nov 14 , 2025 | 11:19 PM
ప్రతి పాఠశా లలో పరిశుభ్రత కచ్చితంగా పాటించాలని కలెక్టర్ రాజకుమారి ఆదేశిం చారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు, ఎంఈవోలతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
కలెక్టర్ రాజకుమారి
నంద్యాల నూనెపల్లి, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): ప్రతి పాఠశా లలో పరిశుభ్రత కచ్చితంగా పాటించాలని కలెక్టర్ రాజకుమారి ఆదేశిం చారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు, ఎంఈవోలతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దడం ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందన్నారు. పదో తరగతి ఫలితాలు, విద్యార్థుల హాజరు, పాఠశాల పరిశుభ్రత, మధ్యాహ్న భోజనం, అపార్ ఐడీ తదితర అంశాలపై చర్చించారు. విద్యార్థుల వ్యక్తిగత పరిశుభ్రత, తొటి విద్యార్థులతో ఎలా మెలగాలి, గురువులను గౌరవించడం వంటి అంశాలపై కూడా అవగాహన కల్పించాలన్నారు. అదే విధంగా, విద్యార్థులు, ఉపాధ్యాయులు వంద శాతం హాజరు నమోదు చేయాలన్నారు. వచ్చేనెల జరగనున్న మెగా పేరెంట్స్- టీచర్స్ మీటింగ్‌కు పూర్తిస్థాయిలో సిద్ధమవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. డీఈవో జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థిని విద్యావంతునిగా తీర్చిదిద్దడంలలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. సమావేశంలో ఎస్‌ఎస్‌ఏ పీవో ప్రేమనాథ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.