Share News

ప్రజల సహకారంతోనే స్వచ్ఛాంధ్ర సాధ్యం

ABN , Publish Date - Apr 19 , 2025 | 11:53 PM

ప్రజల సహకారంతోనే స్వచ్ఛాంధ్ర సాధ్యమని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ద న్‌రెడ్డి అన్నారు.

ప్రజల సహకారంతోనే స్వచ్ఛాంధ్ర సాధ్యం
ప్రతిజ్ఞ చేయిస్తున్న మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

బనగానపల్లె, ఏప్రిల్‌ 19(ఆంధ్రజ్యోతి): ప్రజల సహకారంతోనే స్వచ్ఛాంధ్ర సాధ్యమని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ద న్‌రెడ్డి అన్నారు. శనివారం బనగానపల్లెలో నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర’లో మంత్రిపాల్గొని ఈ-వేస్ట్‌ను సేకరించారు. స్థానిక పంచాయతీ కార్యాల యంలో నిర్వహించిన ‘స్వచ్ఛాంధ్ర-స్వచ్ఛదివస్‌’లో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రజలతో, వివిధ శాఖల అధికారులచే స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. స్థానికంగా పాడైపోయిన మొబైల్‌ఫోన్లు, టీవీలు, వైర్లు, ఇతర ఎలక్ర్టానిక్‌ వస్తువుల ఈవేస్టును ఆయన తొలగించి మాట్లాడారు. 2047 స్వర్ణాంధ్రప్రదేశ్‌ లక్ష్యంగా ప్రతి మూడవ శనివారం స్వచ్చాంధ్ర కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. పట్టణంలో ఇప్పటికే 90శాతం ప్లాస్టిక్‌ రహితంగా తీర్చిదిద్దామన్నారు. ప్రతి ఒక్కరూ మన ఇంటితో పాటు మన చుట్టూఉన్న పరిసరాలను పరిశుభ్రం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. నేటి స్వచ్చాంధ్ర కార్యక్రమంలో ఈ వ్యర్థాల సేకరణ వాటిని సురక్షిత పద్దతుల్లో రీసైక్లింగ్‌ చేయడం అనే థీమ్‌తో నిర్వహిస్తున్నామన్నారు. చెత్తనుంచి సంపద సృష్టించడం ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచన మేరకు అధికారులు, ప్రజలు, యువత అందరూ కలసి స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో మండల స్పెషల్‌ అధికారి సుబ్బారెడ్డి, ఎంపీడీవో రమణ, ఆర్‌డబ్ల్యుఎస్‌ డీఈ మధుసూధన్‌, మండల వ్యవసాయాఽధికారి సుబ్బారెడ్డి, గ్రామ పంచాయితీ ఈవో సతీశ్‌రెడ్డి, ఏపీఎం శ్రీనివాసులు, పంచాయితీ కార్యదర్శులు, పొదుపు మహిళలు పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2025 | 11:53 PM