జీజీహెచ్‌లో ఘనంగా సపోజ్ క్రిస్మస్
ABN , Publish Date - Dec 18 , 2025 | 12:20 AM
యేస్రుకీస్తు లోకరక్షకుడని ప్రేమ, సోదరభావం, సామరస్యం ఆయన బోధనల సారమని పాస్టర్ ఏసురత్నం అన్నారు. బుధవారం ప్రభుత్వ సర్వజన వైద్యశాల ధన్వంతరి హాలులో ఏపీ గవర్నమెంటు నర్సెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సపోజ్ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు.
కర్నూలు హాస్పిటల్, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): యేస్రుకీస్తు లోకరక్షకుడని ప్రేమ, సోదరభావం, సామరస్యం ఆయన బోధనల సారమని పాస్టర్ ఏసురత్నం అన్నారు. బుధవారం ప్రభుత్వ సర్వజన వైద్యశాల ధన్వంతరి హాలులో ఏపీ గవర్నమెంటు నర్సెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సపోజ్ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. నర్సింగ్ సూపరింటెండెంట్ ఎస్‌పీ సావిత్రిబాయి మాట్లాడుతూ క్రిస్మస్ క్రైస్తవులకు అతి పెద్ద పండుగ అని, ప్రతి ఏడాది ఆసు పత్రిలో అందరూ కలిసి వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పాస్టర్ మాట్లాడుతూ ప్రేమ, శాంతి, కరుణ సమ్మిళితం క్రిస్మస్ అని, యేసుక్రీస్తు లోక రక్షకుడు అని, పరస్పరం ప్రేమ, శాంతితో నడిచి క్రీస్తు బోధనలను పాటించాలని సూచించారు. అనంతరం కేక్ కట్‌చేసి, క్యాండిల్ లైట్ సర్వీస్ నిర్వహించారు. హెడ్ నర్సులు లీలారాణి, ఈ.కళావతి, కరుణ ప్రార్థన చేశారు. లీలావతి, సి.బంగారి, శాంతి భవాని, లక్ష్మీనరసమ్మ పాల్గొన్నారు.