Share News

సీహెచ్‌వోలను క్రమబద్ధీకరించాలి

ABN , Publish Date - Apr 29 , 2025 | 11:06 PM

సీహెచ్‌వోలను క్రమబద్ధీకరించాలని నంద్యాల జిల్లా ఏపీఎంసీఏ అధ్యక్షుడు శివకృష్ణ అన్నారు.

సీహెచ్‌వోలను క్రమబద్ధీకరించాలి
నంద్యాలలో మోకాళ్లపై నిలబడి నిరసన తెలుపుతున్న సీహెచ్‌వోలు

ఏపీఎంసీఏ అధ్యక్షుడు శివకృష్ణ

మోకాళ్లపై నిలబడి నిరసన

రెండేళ్లుగా పరిష్కారం కాని సమస్యలు : సీహెచ్‌వోలు

నంద్యాల హాస్పిటల్‌, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): సీహెచ్‌వోలను క్రమబద్ధీకరించాలని నంద్యాల జిల్లా ఏపీఎంసీఏ అధ్యక్షుడు శివకృష్ణ అన్నారు. పట్టణంలో తాలుకా పోలీస్‌స్టేషన్‌ పక్కన కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్లు చేపట్టిన నిరసన రెండో రోజుకు చేరుకున్నది. మంగళవారం మోకాళ్లపై నిలబడి సీహెచ్‌వోలు నిరసన వ్యక్తం చేశారు. రెండేళ్లుగా జీతభత్యాలపై వినతిపత్రాలు ఇస్తున్నా సమస్య పరిష్కరించడంలేదని సీహెచ్‌వోలు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య ఆరోగ్యశాఖలో ఎన్‌హెచ్‌ఎంకింద ఆరేళ్లుగా సీహెచ్‌వోలు పనిచేస్తున్నా జీతంలో ఎలాంటి పురోగతిలేదన్నారు. ఇతర ఉద్యోగులతో సమానంగా 23శాతం ఇంక్రిమెంట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రతినెలా జీతంతో పాటు ప్రోత్సాహకాలు, ప్రతిసంవత్సరం ఐదు శాతం ఇంక్రిమెంట్‌ ఇవ్వాలని కోరారు. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నిరసన చేపట్టామని పేర్కొన్నారు. కార్యక్రమంలో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సౌందర్య, కార్యదర్శి గురుప్రసాద్‌, కోశాధికారి అఖిల్‌, భార్గవ్‌, సీహెచ్‌వోలు పాల్గొన్నారు.

Updated Date - Apr 29 , 2025 | 11:06 PM