Share News

కాశీవిశ్వేశ్వరుడికి బాలాలయం పూజలు

ABN , Publish Date - Aug 19 , 2025 | 12:43 AM

మహానంది మండలం తమ్మడపల్లిలోని కాశీవిశ్వేశ్వర స్వామికి ఆలయం పునఃప్రతిష్ఠ నిర్మాణం లో భాగంగా సోమవారం బాలాలయం పూజలు నిర్వహిం చారు.

కాశీవిశ్వేశ్వరుడికి బాలాలయం పూజలు
బాలాలయం పూజల్లో పాల్గొన్న ఏఈవో మధు, అర్చకులు

మహానంది, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): మహానంది మండలం తమ్మడపల్లిలోని కాశీవిశ్వేశ్వర స్వామికి ఆలయం పునఃప్రతిష్ఠ నిర్మాణం లో భాగంగా సోమవారం బాలాలయం పూజలు నిర్వహిం చారు. ముందుగా మహానంది ఆలయ ఏఈవో ఎర్రమల్ల మధు ఆధ్వర్యంలో ఆలయంలో వేదపండితులు గణపతి పూజ, పుణ్యహ వాచనం, అభిషేకం నిర్వహించారు. అనంతరం గ్రామదేవత అనుగ్రహంతో కంకణధారణ చేశారు. ఈ కార్యక్రమంలో మహానంది దేవస్థానం పాలక మండలి మాజీ చైర్మన కొమ్మా మహేశ్వరరెడ్డి ఉప సర్పంచ ప్రతాప రెడ్డి, టీడీపీ నాయకుడు శ్యామల జనార్ధనరెడ్డి, కుమ్మరి శివయ్య, ఆలయ ఇనచార్జి పర్యవేక్షకుడు పసుపుల సుబ్బారెడ్డి, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 19 , 2025 | 12:43 AM