ఆటపాటలతో హాయిగా..
ABN , Publish Date - May 01 , 2025 | 11:13 PM
నిత్యం పుస్తకాలు, ట్యూషన్లతో కుస్తీ పట్టే విద్యార్థులకు ప్రభుత్వం సమ్మర్ క్యాంపు నిర్వహిస్తోంది. ఆలూరు పట్టణంలోని గ్రంథాలయంలో రోజూ 6 నుంచి 10 పదో తరగతి విద్యార్థులకు చెస్, క్యారమ్స్‌తో పాటు నృత్యం, ఉపన్యాసం తదితర అంశాలలో శిక్షణ ఇస్తున్నారు.
పుస్తక పఠనాలు, ఉపన్యాసాలు..
విద్యార్థులకు సమ్మర్ క్యాంపు
ఆలూరు, మే1(ఆంధ్రజ్యోతి): వేసవిలో విద్యార్థులు సమ్మర్ క్యాంపులో ఆటపాటలతో హాయిగా గడిపేస్తున్నారు. ఆలూరు పట్టణంలోని గ్రంథాలయంలో 50 వరకు పిల్లలు వస్తున్నారు. రోజూ ఆంగ్ల సంభాషణ, చిత్రలేఖనం, రంగులు వేయడం, కాగితంతో కళారూపాలు తయారు చేయడం, సంగీతం, నృత్యం, బొమ్మల తయారీ, నటనతో పాటు, యోగా, క్యారమ్స్, చెస్ ఇలా ఏకాగ్రతను పెంపొందించేలా శిక్షణ ఇస్తున్నారు.
జూన్ 6వరకు శిబిరం
బాలల్లో పఠనాసక్తి పెంపు, వేసవి సెలవులను సద్విని యోగం చేసుకు నేందుకు ప్రభుత్వం గ్రంథాల యాలను వేదికగా చేసింది. జూన్ 6వ తేదీ వరకు వేసవి శిబిరాలు నిర్వహించాలని ఆదేశించింది. ఆరు నుంచి పదో తరగతి విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికి తీసేందుకు ఇవి ఉపయోగపడుతున్నాయి. క్యారమ్స్, చెస్, ఆటలపోటీలు, డ్యాన్సులతో విద్యార్థులు ఉత్సాహంగా గడుపుతున్నారు.
ఇవీ కార్యక్రమాలు
‘చదవడం మాకిష్టం’ కార్యక్రమంలో భాగంగా పుస్తక పఠనం చేయిస్తారు. అనంతరం 20 నిమిషాల పాటు పుస్తక సమీక్ష చేస్తారు. ఉదయం 10;30 గంటల నుంచి 12.30 గంటల వరకు వారికి కథలు వినిపిసారు. పిల్లలతో కథలు కూడా చెప్పిస్తారు.
నీతి కథలు చెబుతున్నారు
సమ్మర్ క్యాంపులో మాకు రోజూ నీతికథలు చెబుతు న్నారు.. మంచి మంచి కథల పుస్తకాలు చదివిస్తున్నారు. నాకు మాట్లాడే అవకాశం ఇచ్చారు, దీతో స్టేజ్ ఫియర్ పోయింది. - ఇందు, విద్యార్థిని, ఆలూరు
ఎంజాయ్ చేస్తున్నాం
సెలవుల్లో గ్రంథాలయంలో నిర్వహిస్తున్న క్యాంపులో స్నేహి తులతో మేము ఎంజాయ్ చేస్తు న్నాం. వివిధ అంశాల్లో శిక్షణ ఇవ్వడమేగాక ఆట, పాటలు నేర్పుతున్నారు. - గాయత్రి, ఆలూరు
వివిధ అంశాలపై శిక్షణ
వేసవిశిబిరంలో విద్యార్థులకు వివిధ అంశాల్లో శిక్షణ ఇస్తు న్నాం. పుస్తక పఠనంతో చదువుతో ఆసక్తితోపాఆటు సృజనాత్మకతను వెలికితీ యవచ్చు. దీంతో మెదడు చురుగ్గా పనిచే స్తుంది. - విజయభాస్కర్, గ్రంథాలయాధికారి, ఆలూరు