బాలల హక్కులను పరిరక్షించాలి
ABN , Publish Date - Nov 14 , 2025 | 11:23 PM
బాలల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కర్నూలు జిల్లా ప్రధాన న్యాయాధికారి జి.కబర్ధి అన్నారు.
జిల్లా ప్రధాన న్యాయాధికారి జి. కబర్ధి
కర్నూలు లీగల్, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): బాలల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కర్నూలు జిల్లా ప్రధాన న్యాయాధికారి జి.కబర్ధి అన్నారు. స్థానిక బి.క్యాంపులోని బాలుర పరిశీలన గృహంలో జరిగిన బాలల దిన వేడుకలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా కబర్ధి మాట్లాడుతూ తెలిసీ తెలియని వయసులో బాలలు చేసిన తప్పులను సరిదిద్దాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉంద న్నారు. బాలలు కూడా తమ బాధ్యతలను, హక్కులను తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉందన్నారు. సందర్భంగా ఆయన బాలలకు సంబంధించిన చట్టాలను ఉచిత న్యాయ సహాయం గురించి వివరించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకటశేషాద్రి, జువైనల్ జస్టిస్ బోర్డు న్యాయాధికారి అపర్ణ, న్యాయవాదులు బద్దెల లక్ష్మినారాయణ, బోర్డు సభ్యులు సునీతా, మాధవి, పరిశీలన గృహం సూపరింటెండెంట్ హుసేన్‌బాషా తదితరులు పాల్గొన్నారు.
కంటి వైద్య శిబిరం ప్రారంభం
స్థానిక ప్రభుత్వ బీసీ, ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్‌లో నిర్వహించిన కార్యక్రమానికి కర్నూలు జిల్లా ప్రధాన న్యాయాధికారి జి.కబర్ధి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా.కే. స్వాతి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్యశిబిరాన్ని ప్రారంభించారు. బాలలకు నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజక్టు డైరెక్టర్ విజయ, డీసీపీవో శారద, డా.రాయపాటి శ్రీనివాసులు పాల్గొన్నారు.