బాల్య వివాహాలను అరికట్టాలి
ABN , Publish Date - Sep 25 , 2025 | 11:43 PM
బాల్య వివాహాలను అరికట్టాలని, ఈ సాంఘిక దురాచారానికి అందరూ స్వస్తి పలకాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి కోరారు
కర్నూలు లీగల్, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): బాల్య వివాహాలను అరికట్టాలని, ఈ సాంఘిక దురాచారానికి అందరూ స్వస్తి పలకాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి కోరారు. న్యాయ సేవాసదన్ భవన్‌లో గురువారం సమావేశం నిర్వహించారు. పురోహితులు, ఫాస్టర్లు, ఖాజీలు, ఆలయాల ఈవోలకు అవగాహన ఉండాలని, బాల్య వివాహాల కోసం వస్తే టోల్‌ఫ్రీ.నెం.15100కు ఫోన్ చేయాలన్నారు. ఐసీడీఎస్ అధికారి శారద మాట్లాడుతూ కొత్త చట్టాల ప్రకారం బాల్య వివాహాలు చేసిన వారికి రెండు సంవత్సరాల కఠిన కారాగారశిక్షపడుతుందన్నారు. లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శివరాం, నగర బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు సండే చంద్రశేఖర్, ఉపాధ్యక్షుడు శ్యాంసుందర్, ఖాజీలు, ఫాస్మర్లు, బచ్‌పన్ బచావో ఎన్జీవో మౌనిక తదితరులు పాల్గొన్నారు.