Share News

బాల్యవివాహాలకు దూరంగా ఉండాలి

ABN , Publish Date - Aug 21 , 2025 | 11:32 PM

అమ్మాయిలు బాల్య వివాహాలకు దూరంగా ఉండి లక్ష్యాలను చేరుకోవాలని సీనియర్‌ సివిల్‌ జడ్జి తంగమణి అన్నారు.

బాల్యవివాహాలకు దూరంగా ఉండాలి
మాట్లాడుతున్న న్యాయాధికారి తంగమణి

సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి తంగమణి

నంద్యాల క్రైం, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): అమ్మాయిలు బాల్య వివాహాలకు దూరంగా ఉండి లక్ష్యాలను చేరుకోవాలని సీనియర్‌ సివిల్‌ జడ్జి తంగమణి అన్నారు. గురువారం నంద్యాల పట్టణంలోని ఎస్టీ బాలికల వసతిగృహాన్ని జడ్జి తనిఖీ చేసి విద్యార్థినులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా జడ్జి తంగమణి మాట్లాడుతూ కౌమారదశలో వచ్చే సమస్యలు, బాల్య వివాహాల ద్వారా వచ్చే సమస్యలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో లోక్‌అదాలత్‌ సిబ్బంది రామచంద్రారెడ్డి, హాస్టల్‌ వార్డెన్లు, ఉపాధ్యాయులు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Aug 21 , 2025 | 11:32 PM