బాల్య వివాహాలు చట్ట వ్యతిరేకం
ABN , Publish Date - Dec 19 , 2025 | 11:17 PM
బాల్య వివాహాలు చట్ట వ్యతిరేకమని, వీటివల్ల అనర్థాలు జరుగుతాయని జిల్లా ప్రధాన న్యాయాధికారి జి. కబర్ధి తెలియజేశారు.
జిల్లా ప్రధాన న్యాయాధికారి జి. కబర్ధి
కర్నూలు లీగల్, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): బాల్య వివాహాలు చట్ట వ్యతిరేకమని, వీటివల్ల అనర్థాలు జరుగుతాయని జిల్లా ప్రధాన న్యాయాధికారి జి. కబర్ధి తెలియజేశారు. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు బాల్య వివాహాల నిర్మూలనపై శుక్రవారం తన కార్యాలయంలో ఫ్లెక్సీలు, బ్యానర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాలతో పిల్లల బంగారు భవిష్యత్తే గాక నష్టపోతుందన్నారు. 18 సంవత్సరాలలోపు అమ్మాయిలకు వివాహం చేస్తే ఆరోగ్యం దెబ్బతింటుందని, బాలికలు గర్భిణి అయితే శిశువు గర్భంలోనే మరణించే అవకాశం ఉందని తెలిపారు. పిల్లలకు అంగవైకల్యం, బుద్ధి మాంద్యం వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకటశేషాద్రి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ విజయ, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శారద, సూపర్‌వైజర్ రాజేశ్వరి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ జుబేదా బేగం, లీగల్ ఎయిడ్ మెంబర్ డా. రాయపాటి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.