పతి ్తపంటపై గడ్డి మందు పిచికారి
ABN , Publish Date - Jul 30 , 2025 | 12:12 AM
పత్తి పంటపై కొందరు దుండగులు గడ్డిమందు పిచికారి చేయడంతో పంట దెబ్బతిని రైతుకు దాదాపు రూ.2లక్షల మేర నష్టం వాటిల్లింది.
ఆదోని రూరల్, జూలై 29 (ఆంధ్రజ్యోతి): పత్తి పంటపై కొందరు దుండగులు గడ్డిమందు పిచికారి చేయడంతో పంట దెబ్బతిని రైతుకు దాదాపు రూ.2లక్షల మేర నష్టం వాటిల్లింది. బాధిత రైతు దిబ్బనకల్లు గ్రామానికి చెందిన కురువ గోవిందు తెలిపిన మేరకు.. సర్వే నెం.1బీలో ఎకరా పొలం ఉంది. తన పొలానికి అనుకొని వీరేష్ అనే వ్యక్తికి రెండెకరాల పొలం ఉంది. గత మూడేళ్లుగా గోవిందు వీరేష్ పొలాన్ని గుత్తకు తీసుకున్నాడు. మొత్తం మూడెకరాల్లో పత్తి సాగు చేశాడు. కాగా ఇప్పటికే ఉన్న మనస్పర్థల కారణంగా గ్రామానికి చెందిన కృష్ణారెడ్డితోపాటు మరో ముగ్గురు సోమవారం అర్ధరాత్రి దాటాక పత్తిపంటపై గడ్డిమందు పిచికారి చేయడంతో కళకళలాడే పత్తిపంట మాడిపోయింది. ఈమేరకు మంగళవారం తాలుకా ఎస్‌ఐ రామాంజనేయులుకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు పంటను పరిశీలించారు. విచారణ చేసి చర్యలు తీసుకుంటున్నామని ఎస్‌ఐ తెలిపారు.