చెక్‌డ్యాం ధ్వంసం.. నీట మునిగిన పొలాలు
ABN , Publish Date - Sep 18 , 2025 | 11:58 PM
మండల కేంద్రం శివారు యజ్ఞం చెరువు సమీపంలోని చెక్‌డ్యాంను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో పొలాలు నీట మునుగుతున్నాయని రైతులు రామకృష్ణ, తిమ్మప్ప, సుధాకర్ వాపోయారు
పంటలు దెబ్బతింటున్నాయని రైతుల ఆవేదన
పరిశీలించిన తహసీల్దార్ గుండాల్ నాయక్
మద్దికెర సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రం శివారు యజ్ఞం చెరువు సమీపంలోని చెక్‌డ్యాంను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో పొలాలు నీట మునుగుతున్నాయని రైతులు రామకృష్ణ, తిమ్మప్ప, సుధాకర్ వాపోయారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో చెరువు పూర్తిగా నిండిందని, కొందరు దుండగులు గట్టును పగులకొట్టారన్నారు. పొలాల్లో అడుగులోతు నీరు నిలిచి పంటలు దెబ్బతింటనాఆ్నయని ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్దార్ గూండాల్ నాయక్‌కు వినతి పత్రం అందజేయగా సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.