తక్కువ ధరకే బంగారమంటూ మోసం!
ABN , Publish Date - Jun 10 , 2025 | 01:02 AM
తమకు బంగారం దొరికిందని, తక్కువ ధరకే విక్రయిస్తామని నమ్మబలికి మోసం చేసిన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

24 గంటల్లో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
దేవనకొండ, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): తమకు బంగారం దొరికిందని, తక్కువ ధరకే విక్రయిస్తామని నమ్మబలికి మోసం చేసిన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఐ వంశీనాథ్ తెలిపిన మేరకు.. మండలంలోని గుండ్లకొండ గ్రామానికి చెందిన కప్పల రంగస్వామి అనే వ్యక్తి వద్దకు ఆదివారం నెల్లూరు జిల్లాకు చెందిన మహిళతోపాటు ముగ్గురు వ్యక్తులు వచ్చి తమకు బంగారం దొరికందని తక్కువ ధరకే విక్రయిస్తామని నమ్మ బలికారు. నకిలీ బంగారం గొలుసు చూపి, దాదాపు పది తులాలు ఉంటుందని, ఆడ్వాన్స్‌గా రూ.1.2లక్షలు ఆడ్వాన్స్ తీసుకొని మిగిలిన డబ్బును తాము మరలా వచ్చిన్నప్పుడు ఇవ్వాలని ఒప్పందం చేసుకుని ఉండాయించారు. బాధితుడికి అనుమానం వచి పరీక్షలు చేయించగా నకిలీ బంగారంగా తేలింది. తాను మోసపోయానని గ్రహించిన రంగస్వామి దేవనకొండ పోలీసులను ఆశ్రయించాడు. సీఐ వంశీనాథ్ సిబ్బందితో గాలించి 24 గంటలలో నిందుతులను దేవనకొండ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. నిందుతులపై కేసు నమోదు చేసి, పత్తికొండ న్యాయాధికారి ఎదుట హాజరుపరిచారు. అపరిచిత వ్యక్తులను నమ్మవద్దని అప్రమత్తంగా ఉండాలని ప్రజలను సీఐ హెచ్చరించారు.