డ్రోన్ టెక్నాలజీతో మార్పులు
ABN , Publish Date - May 13 , 2025 | 11:51 PM
: డ్రోన్ టెక్నాలజీతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని కలెక్టర్ రాజకుమారి అన్నారు.
రైతులకు ఉపాధి అవకాశాలు
80శాతం రాయితీ అందిస్తాం
కలెక్టర్ రాజకుమారి
కిసాన్ డ్రోన్స్ వినియోగంపై అవగాహన
నంద్యాల నూనెపల్లె, మే 13 (ఆంధ్రజ్యోతి) : డ్రోన్ టెక్నాలజీతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని కలెక్టర్ రాజకుమారి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సెంటినరీ హాల్‌లో వ్యవసాయంలో కిసాన్ డ్రోన్స్ వినియోగంపై సంబంధిత అధికారులతో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డ్రోన్ టెక్నాలజీతో రైతులకు మెరుగైన ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు. రోబో కృషి 3ప్రొ అనే డ్రోన్ సుమారు రూ.9.8లక్షలవరకు ఖర్చు అవుతుందని, అందులో 80శాతం సబ్సిడీ ఇవ్వడం జరుగుతోందన్నారు. ఆటోమేటిక్ విధానం ద్వారా రైతుల దగ్గర ఉన్న ఎఫ్‌ఎంబీకాపీలో ఉన్న రేఖాంశం, అక్షాంశాల వివరాలను డ్రోన్‌లో నమోదు చేస్తే మనిషి అవసరం లేకుండా పొలం మొత్తం స్ర్పేచేసే అవకాశం ఉంటుందని ఆమె పేర్కొన్నారు. డ్రోన్‌కు పొలాల దగ్గర చార్జింగ్ పెట్టుకునే అవకాశంతో పాటు డ్రోన్స్ ట్యాంక్ సామర్థ్యాన్ని పెంచేలా చూడాలని రోబో నిర్వాహకులను కలెక్టర్ కోరారు. జిల్లా వ్యవసాయ అధికారి, నాబార్డు డీడీఎం, డ్రోన్ సంస్థ నిర్వాహకులు కిసాన్ డ్రోన్స్ సాంకేతిక వినియోగం, ఉపయోగాలు, బ్యాంక్‌రుణం తదితర అంశాలపై వ్యవసాయ అధికారులకు, రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి మురళీకృష్ణ, ఎల్‌డీఎం రవీందర్‌కుమార్, ఆర్‌ఆర్‌ఎస్ ప్రిన్సిపాల్ డా.రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.