వంద రోజుల కార్యాచరణలో మార్పులు చేయాలి: ఏపీటీఎఫ్
ABN , Publish Date - Dec 07 , 2025 | 11:58 PM
పదో తరగతి వంద రోజుల కార్యాచరణలో మార్పులు చేయాలని ఏపీటీఎఫ్ నాయ కులు ప్రభుత్వాన్ని కోరారు.
నంద్యాల ఎడ్యుకేషన్, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): పదో తరగతి వంద రోజుల కార్యాచరణలో మార్పులు చేయాలని ఏపీటీఎఫ్ నాయ కులు ప్రభుత్వాన్ని కోరారు. పట్టణంలోని ఏపీటీఎఫ్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు రామచంద్రుడు, ప్రధాన కార్యదర్శి శివయ్య మాట్లాడుతూ పదవ తరగతి వందరోజుల ప్రణాళికలో రెండో శనివారం, ఆదివారం సెలవు రోజులను మినహాయించాలని కోరారు. కార్యాచరణలో పాల్గొన్న ఉపాధ్యాయులకు వెంటనే సీసీఎల్ మంజూరు చేయాలని, డీఎస్సీ 2025 ఉపాధ్యాయులకు లీప్ యాప్ ద్వారా సెలవు పెట్టుకోవడంలో ఇబ్బందులను తొలగించాలని ప్రభుత్వాన్ని కోరారు. పరీక్షలను వెనువెంటనే నిర్వహించడంతో అసెసెమెంట్ బుక్‌లెట్‌ను కరెక్షన్ చేయడంలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయన్నారు. సమావేశంలో రాష్ట్ర కౌన్సిలర్లు వీరేశ్వరరెడ్డి, జాకీర్ హుస్సేన్, జిల్లా సబ్ కమిటీ సభ్యులు శ్రీనివాసులు, నారాయణ, మధు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.