మార్పు మంచిదే
ABN , Publish Date - Mar 12 , 2025 | 12:27 AM
గ్రామంలోని మెయిన్ బజారులో రోడ్డుకిరువైపులా 20 ఏళ్లకు పైగా వ్యాపారాలు చేసుకునేవారు. రహదారి పక్కనే కూరగాయాలు ఉండటంతో నిత్యం వాహనదారులు, పాదచారులు ఇబ్బంది పడేవారు.

మద్దికెర, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): గ్రామంలోని మెయిన్ బజారులో రోడ్డుకిరువైపులా 20 ఏళ్లకు పైగా వ్యాపారాలు చేసుకునేవారు. రహదారి పక్కనే కూరగాయాలు ఉండటంతో నిత్యం వాహనదారులు, పాదచారులు ఇబ్బంది పడేవారు. కూటమి ప్రభుత్వం నాబార్డు నిధులు రూ.18 లక్షలు, మాజీ సర్పంచ్ కొత్తపేట వెంకటేశ్వరరెడ్డి రూ.3లక్షలు విరాళం ఇచ్చారు. ఎమ్మెల్యే శ్యాంబాబు చొరవ తీసుకుని మార్కెట్ యార్డు నిర్మించారు. దీంతో వ్యాపారులు, మార్కెట్‌లో షెడ్ల కింద వ్యాపారాలు చేసుకుంటున్నారు. వినియోగ దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.