Share News

రాష్ట్రాభివృద్ధే చంద్రబాబు ధ్యేయం

ABN , Publish Date - Apr 21 , 2025 | 01:25 AM

రాష్ర్టాభివృద్ధే సీఎం చంద్రబాబు నాయుడు ధ్యేయమని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు.

రాష్ట్రాభివృద్ధే చంద్రబాబు ధ్యేయం
ఎమ్మిగనూరులో భారీ కేక్‌ కట్‌ చేస్తున్న ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి

ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి

టీడీపీ కార్యాలయం నుంచి సోమప్ప సర్కిల్‌ వరకు బైక్‌ ర్యాలీ

ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు

ఎమ్మిగనూరు, ఏప్రిల్‌ 20(ఆంధ్రజ్యోతి): రాష్ర్టాభివృద్ధే సీఎం చంద్రబాబు నాయుడు ధ్యేయమని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా పార్టీ కార్యాలయం నుంచి ఎమ్మెల్యే బీవీ, టీడీపీ నాయకులు సోమప్ప సర్కిల్‌ వరకు భారీ ఎత్తున బైక్‌ ర్యాలీ నిర్వహించారు. సోమప్ప సర్కిల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 75 కేజీల కేక్‌ను ఎమ్మెల్యే బీవీ కట్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు విష యంలో వయసు అనేది నంబర్‌ మాత్రమేనన్నారు. యుగపురుషుడు ఎన్టీఆర్‌ అయితే చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలు వేడిని వాడిని, మేదస్సును ప్రపంచపటంలో పెట్టిన మహానుభావుడన్నారు. ఆయన వందేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. సీఎంకు ఎమ్మిగనూరు పార్టీ శ్రేణుల తరుపున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, బ్రేడ్లు, పండ్లు అందజేశారు. నాయకులు కొండయ్య చౌదరి, మిఠాయి నరసింహులు, రామదాసు గౌడ్‌,మహేంద్ర బాబు, గుంటుపల్లి భాస్కర్‌ చౌదరి, కడిమెట్ల చెన్నారెడ్డి, యుకే వీరేంద్ర, అల్తాఫ్‌, కాశీం వలి, ధర్మపురం గోపాల్‌, చిన్నరాముడు, మహేష్‌, నారాయణరెడ్డి, మాచాని శివశంకర్‌, తురేగల్‌ నజీర్‌, నంబూరి సురేష్‌చౌదరి, నవాజ్‌, ఫారుక్‌, సురేష్‌, మాచాని శివకుమార్‌, రంగస్వామి గౌడ్‌, రామకృష్ణనాయుడు, సూర్యనా రాయణ రెడ్డి, అంజి, కటారి రాజేంద్ర పాల్గొన్నారు.

కమ్మసంఘం ఆధ్వర్యంలో... పట్టణంలోని అమరావతి రెసిడెన్సిలో ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకలను కమ్మసంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేక్‌ను కట్‌ చేసి మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు. టీడీపీ నాయకులు బాస్కర్ల చంద్ర శేఖర్‌ చౌదరి, కమ్మసంఘం గౌరవాధక్ష్యలు మహేంద్రబాబు, అధ్యక్షులు గుంటుపల్లి భాస్కర్‌ చౌదరి, ఉపాఽధ్యక్షుడు నరసింహరావు, తమ్మినేని రవిశంకర్‌, ట్రెజరర్‌ కాకర్ల వీరేష్‌ చౌదరి, సభ్యులు నంభూరి సూరేష్‌ చౌదరి, జగదీష్‌, సురేష్‌, ఉపేంద్ర, గురుప్రసాద్‌, లోకేష్‌, రాఘవేంద్ర, వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్‌, హనుమంతు పాల్గొన్నారు.

మంత్రాలయం: రాష్ట్రాభివృద్ధి సీఎం చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని మంత్రాలయం టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి ఎన రాఘవేం ద్రరెడ్డి అన్నారు. ఆదివారం మాధవరంలోని తననివాసంలో చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్‌ కట్‌ చేశారు. బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రంలో టీడీపీ సీనియర్‌ నాయకులు రఘునాథరెడ్డి, రాకేష్‌రెడ్డి, తెలుగు రైతు జిల్లాప్రతినిధి, దూదేకుల సంఘం రాష్ట్ర గౌరవ సలహాదారులు సాయిబాబు, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి చావిడి వెంకటేష్‌, మాజీ జడ్పీటీసీ ఆర్‌ లక్ష్మయ్య, చంద్ర, ఎస్‌ఎం గోపాల్‌ రెడ్డి, పవనకుమార్‌, గోపాల్‌, వరదరాజు, నాగేష్‌ నాయుడు, లింగప్ప, రాజన్న, ఏసన్న, రామకృష్ణ, ఉరుకుందు, బొజ్జప్ప, చాకలి రాఘవేంద్ర, విజయ్‌కుమార్‌, నరసింహులు పాల్గొన్నారు.

గోనెగండ్ల: మండల కేంద్రమైన గోనెగండ్లలో ఆదివారం సీఎం చంద్రబాబు నాయుడి 75వ జన్మదిన వేడుకలను మండల టీ డీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. టీడీపీ కార్యాలయ ఆవరణంలో కార్యకర్తలు కేక్‌ కట్‌చేసి శుబాకాక్షలు తెలుపుకున్నారు. మిఠాయిలు పం చుకున్నారు. నాయకులు బేతాళబడేసా, తిరుపత్యనాయుడు, తిమ్మారెడ్డి, రంగముని, అడ్వకేట్‌ చంద్రశేఖర్‌, వెంకటేశ్వర్లు, కాంట్రాక్టర్‌ షేక్షావలి, రాజేష్‌, హరికృష్ణ, రమణ, భారతం రహంతుల్లా, మిన్నల్ల, ఫకృద్దీన, రఫీక్‌, ఐరన బండ బాషా, నూర, మదీనా పాల్గొన్నారు.

పెద్దకడుబూరు: మండల కేంద్రమైన పెద్దకడుబూరుతో పాటు ఆయా గ్రామాల్లో టీడీపీ నాయకులు ఆదివారంముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు 75వ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఉదయం 8గంటలకే మండల కేంద్రమైన పెద్దకడుబూరులో టీడీపీ రాష్ట్ర రైతు సంఘం అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి, తెలుగు మహిళా నాయకురాలు నరవ శశిరేఖ ఆధ్వర్యంలో కేక్‌కట్‌ చేసి, మిఠా యిలు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. మల్లికార్జున, మీసేవా ఆంజనేయులు, వీరేష్‌గౌడు, ఎంజీ నరసన్న, లక్ష్మన్న, నరసింహారెడ్డి, ఈరన్న పాల్గొన్నారు.

కౌతాళం: మండల కేంద్రమైన కౌతాళంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను రెండు వర్గాలుగా విడిపోయి పోటాపోటీగా నిర్వహించారు. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు చెన్నబసప్ప ఆధ్వర్యంలో పార్టీ మండల నాయకులతో కలసి ఘనంగా జరుపుకున్నారు. పార్టీ కార్యాలయం వద్ద మండల అధ్యక్షుడు ఉలిగయ్య ఆధ్వర్యంలో జన్మదిన నిర్వహించారు. నాయకులు బాపురం శివమోహన రెడ్డి, కోట్రేష్‌గౌడ్‌,, కురుగోడు, దొడ్డనగౌడ్‌, కుంబళనూరు సర్పంచ వీరేష్‌, ఈరన్న గౌడ్‌,కౌతాళం టౌన టీడీపీ అధ్యక్షుడు కాశీవిశ్వనాథ్‌, మంజు నాథ, మైనార్టీ నాయకులు రహిమాన, రఫీక్‌, ఉరుకుంద నరసింహులు, శివప్పగౌడ్‌ ఉన్నారు.

కోసిగి: మండల కేంద్రమైన కోసిగిలో టీడీపీ నాయకులు వేర్వేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రాలయం టీడీపీ ఇనచార్జి రాఘవేంద్రరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి రెండు వర్గాల నాయకులు, కార్యకర్తలు వేడుకలు జరుపుకున్నారు. రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ముత్తురెడ్డి, పల్లెపాడు రామిరెడ్డి ప్రత్యేక పూజలు చేసి ఆలయం ముందు కేక్‌ కట్‌ చేశారు. తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి పాలకుర్తి దివాకర్‌రెడ్డి, పెండ్యాల భరద్వాజశెట్టి ఆధ్వర్యంలో భారీ కేక్‌ కట్‌చేసీ సీఎం చంద్రబాబు పుట్టినరోజు ఘనంగా నిర్వహించారు. పేదలకు అన్నదానం నిర్వహించారు. టీడీపీ నాయ కులు జ్ఞానేష్‌, నాడిగేని అయ్యన్న, కోసిగి, ఆలూరు మాజీ జడ్పీటీసీలు రామకృష్ణ, రాంభీమ్‌ నాయుడు, నాడిగేని చిన్నతాయన్న, గౌస్‌, మదిరి వీరారెడ్డి, వీరయ్య, ఉప్పలపాటి అర్జున, గుండేష్‌, రంగారెడ్డి, సొట్టయ్య, నాడిగేని మహాదేవ, ఈరెడ్డి, ఉలిగయ్య, సోల్మాన రాజు, గాంధీనగర్‌ శ్రీను, కృష్ణారెడ్డి, రామయ్య, హనుమంతు, మారేష్‌ ఉన్నారు.

Updated Date - Apr 21 , 2025 | 01:26 AM