భవిష్యత్తుకు భరోసా చంద్రబాబు: ఎమ్మెల్యే
ABN , Publish Date - Aug 26 , 2025 | 12:45 AM
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భవిష్యత్తు తరానికి భరోసా కల్పిస్తారని ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు.
కోడుమూరు, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భవిష్యత్తు తరానికి భరోసా కల్పిస్తారని ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు. స్థానిక సంత మార్కెట్లో సోమవా రం నిర్వహించిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేర కు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. వైసీపీ పాల నలో వైఎస్ జగన రాషా్ట్రన్ని సర్వనాశనం చేశారన్నారు.. కోడుమూరు ప్రజలకు తాగునీటికి శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ నిచ్చారు. అనంతరం మోదీ, చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, నారా లోకేశ చిత్రపటాలకు మహిళలు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు రామకృష్ణారెడ్డి, బలరాం, గంగాధర్, అయ్యప్ప, బాలకృష్ణ, కేఈ రఘుబాబు, ఎస్‌ఐ డీవై స్వామి పాల్గొన్నారు.