పారిశ్రామికవేత్తలుగా అభివృద్ధి చెందొచ్చు
ABN , Publish Date - May 29 , 2025 | 12:44 AM
ఉద్యం పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకోవడంతో భవిష్యత్తులో వ్యాపారులు సైతం పారిశ్రామికవేత్తలుగా అభివృద్ధి చెందే అవకాశ ముందని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ అరుణ అన్నారు.
ప్రభుత్వ ప్రోత్సాహకాలు, రాయితీలను పొందండి
రాబోయే రోజుల్లో ఉద్యం పోర్టల్‌కు అధిక ప్రాధాన్యం
జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ అరుణ
కర్నూలు రాజ్‌విహార్ సర్కిల్ మే 28 (ఆంధ్రజ్యోతి): ఉద్యం పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకోవడంతో భవిష్యత్తులో వ్యాపారులు సైతం పారిశ్రామికవేత్తలుగా అభివృద్ధి చెందే అవకాశ ముందని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ అరుణ అన్నారు. బుధవారం కార్యాలయంలో సూక్ష్మ, చిన్న తరహ పరిశ్రమల ప్రతినిధులతో ఉద్యం పోర్టల్‌పై అవగాహన ఏర్పాటుచేశారు. ఉద్యం పోర్టల్‌లో పేర్లను నమోదు చేసుకోవటంతో ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలు, రాయితీలను పొందవచ్చు అన్నారు. కొన్ని సందర్భాల్లో టెండర్లలో పాల్గొనేవారికి ఉద్యం నమోదు ప్రా మాణికంగా, అర్హతగా చూస్తున్నారన్నారు. అందువల్ల సూక్ష్మ, చిన్నతరహ పరిశ్రమల నిర్వాహకులు తమ పేర్లను ఇందులో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు ఉద్యం పోర్టల్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఆమె పేర్కొ న్నారు. కార్యక్రమంలో పరిశ్రమల అభివృద్ధి అధికారి డానియేలు తదితరులు పాల్గొన్నారు.