Share News

తైక్వాండో చాంపియన్‌గా కర్నూలు

ABN , Publish Date - May 28 , 2025 | 12:13 AM

ఉమ్మడి జిల్లా తైక్వాండో అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి తైక్వాండో పోటీలు మంగళవారం ముగిశాయి. ఈ పోటీల్లో కర్నూలు జిల్లా క్రీడాకారులు మొదటి స్థానంలో నిలిచి బంగారు, రజిత, కాంస్య పతకాలను సాధిం చారు.

తైక్వాండో చాంపియన్‌గా కర్నూలు
తైక్వాండో విజేత కర్నూలు జట్టుతో అతిథులు

కర్నూలు స్పోర్ట్స్‌, మే 27 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లా తైక్వాండో అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి తైక్వాండో పోటీలు మంగళవారం ముగిశాయి. ఈ పోటీల్లో కర్నూలు జిల్లా క్రీడాకారులు మొదటి స్థానంలో నిలిచి బంగారు, రజిత, కాంస్య పతకాలను సాధిం చారు. రెండో స్థానంలో నంద్యాల, మూడో స్థానంలో ఎమ్మిగనూరు క్రీడాకారులు నిలిచారు. కార్యక్రమానికి జిల్లా ఒలింపిక్‌ అసోసియేషన్‌ సీఈవో విజయకుమార్‌, కార్యదర్శి శ్రీనివా సులు, జిల్లా తైక్వాండో సంఘం ఇన్‌చార్జి కార్యదర్శి సతీష్‌ కుమార్‌, నంద్యాల ఇన్‌చార్జి అబ్దుల్‌ మజీద్‌, పోటీల పర్యవేక్షకులు సాయిబాబా, నయూబ్‌ రసూల్‌లు పాల్గొని విజేతలకు పతకాలను అందజేశారు. కార్యక్రమంలో తైక్వాండో శిక్షకులు వీరేష్‌బాబు, శివన్న, పరమేష్‌, ధర్మేంద్ర పాల్గొన్నారు.

Updated Date - May 28 , 2025 | 12:14 AM