సీఈవో చేతివాటం
ABN , Publish Date - Jun 18 , 2025 | 11:49 PM
నాగంపల్లి సొసైటీలో 2022 నుంచి సీఈవోగా విధులు నిర్వహిస్తున్న కోటేశ్వరయ్య కొంతకాలంగా రైతులు చెల్లించిన బకాయిలను బ్యాంకులో జమ చేసుకోకుండా చేతివాటం ప్రదర్శించినట్లు తెలుస్తుంది.
నాగంపల్లి సొసైటీలో నిధులు గోల్‌మాల్
సుమారు రూ.50 లక్షలకు పైగా స్వాహా...?
సీఈవోను సస్పెండ్ చేసిన అధికారులు
కొత్తపల్లి, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): నాగంపల్లి సొసైటీలో 2022 నుంచి సీఈవోగా విధులు నిర్వహిస్తున్న కోటేశ్వరయ్య కొంతకాలంగా రైతులు చెల్లించిన బకాయిలను బ్యాంకులో జమ చేసుకోకుండా చేతివాటం ప్రదర్శించినట్లు తెలుస్తుంది. సుమారు రూ.50లక్షలకు పైగా బ్యాంకు నిధు లు స్వాహాచేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈసొ సైటీలో నిధులు గోల్‌మాల్ జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసినట్లు ఆత్మకూరు సొసైటీ బ్యాంకు మేనేజర్ మహ్మద్‌రసూల్ తెలిపారు. వివరాలు.. నాగంపల్లి సొసైటీలో సీఈవోగా విధులు నిర్వహిస్తున్న కోటేశ్వరయ్య ఈఏడాది మార్చి నుంచి విధులకు సక్రమంగా హాజ రు కావడం లేదు. అతడిపై అనుమానం రావడంతో కర్నూలు బ్రాంచ్ మేనేజర్‌కు ఈ నెల 10వ తేదీ పిర్యాదు చేశాం. ఈ మేరకు నంద్యాల సొసైటీ చీఫ్ మేనేజర్ సౌజన్యదీప్తితో పాటు తాను విచారణ చేపట్టామన్నారు. ఈ విచారణలో రైతులు బ్యాంకుకు చెల్లించాల్సిన నగదును బ్యాంకులో జమ చేయకుండా తన సొంతానికి రూ.10లక్షల మేర వాడుకు న్నట్లు విచారణలో తేలిందన్నారు. ఆ నగదును సదరు సీఈవో నుంచి రికవరీ చేసి ఈ నెల 12న ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కోటేశ్వరయ్యను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. ఇంకా పూర్తిస్థాయిలో సీఈవోపై విచారణ చేస్తున్నామని, భారీ ఎత్తున బ్యాంకు నిధులు గోల్‌మాల్ జరిగినట్లు ఆరోపణలు కూడా వస్తున్నాయని చెప్పారు. విచారణ పూర్తయిన వెంటనే తుది నివేదికను ఉన్నతాధి కారులకు అందజేసి శాఖాపరమైన చర్యలు తీసుకుం టామని రసూల్ తెలిపారు.