Share News

కేంద్ర బృందం పర్యటన

ABN , Publish Date - Nov 27 , 2025 | 11:36 PM

ఉమ్మడి జిల్లాలో కుష్ఠు వ్యాధిని నిర్మూలించేందుకు ఆరోగ్య కార్యకర్తలు నిర్వహి స్తున్న లెప్రసీ కేస్‌ డిటెక్షన్‌ క్యాంపెయిన్‌ సర్వేను పరిశీలించేందుకు కేంద్ర బృంధం గురువారం కర్నూలుకు వచ్చింది.

కేంద్ర బృందం పర్యటన
డీఎంహెచ్‌వోతో చర్చిస్తున్న కేంద్ర బృందం

లెప్రసీ కేస్‌ డిటెక్షన్‌ సర్వే పరిశీలన

కర్నూలు హాస్పిటల్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలో కుష్ఠు వ్యాధిని నిర్మూలించేందుకు ఆరోగ్య కార్యకర్తలు నిర్వహి స్తున్న లెప్రసీ కేస్‌ డిటెక్షన్‌ క్యాంపెయిన్‌ సర్వేను పరిశీలించేందుకు కేంద్ర బృంధం గురువారం కర్నూలుకు వచ్చింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో కేంద్ర బృందం డీఎంహెచ్‌వో డా.ఎల్‌. భాస్కర్‌ను కలిసి సర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఎంహచ్‌వో మాట్లాడుతూ జిల్లాలో 132 మందికి కుష్ఠు వ్యాధితో బాధపడుతున్నారని తెలిపారు. వీరందరికీ 6 నుంచి 12 నెలల వరకు మల్టీ డ్రగ్‌ థెరపీ మందులు వచ్చి చికిత్స అందిస్తున్నామని కేంద్ర బృందానికి తెలిపారు. బృందం సభ్యుడు డా.వి. శాంతారాం మాట్లాడు తూ ఈ నెల 17 నుంచి డిసెంబరు 2వ తేదీ వరకు సర్వే జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో కేంద్ర బృందం సభ్యులు డా. రితీ తివారి, డా. మాన్సి రాష్ట్రస్థాయి అధికారి డా. దేవసాగర్‌, న్యూక్లియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డా. మల్లికార్జున, కన్సల్టెంట్‌ సత్యవతి పాల్గొన్నారు.

Updated Date - Nov 27 , 2025 | 11:36 PM