రాష్ర్టాభివృద్ధికి కేంద్రం సహకారం
ABN , Publish Date - Oct 14 , 2025 | 11:35 PM
రాష్ర్టాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు.
ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్
ప్రధాని పర్యటన ఏర్పాట్ల పరిశీలన
శ్రీశైలం, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): రాష్ర్టాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. మంగళశారం మంత్రి అనగాని సత్యప్రసాద్‌తో కలిసి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, చింతమనేని ప్రభాకర్, జిల్లా కలెక్టర్ రాజకుమారితో కలిసి ప్రధాని పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆలయం బయట విలేకరులతో మాట్లాడారు. శ్రీశైల క్షేత్రంకు భారత ప్రధాని రావడం మరింత పాశ్యా స్తాన్ని పెంచుతుందన్నారు. శ్రీశైల క్షేత్ర ప్రాముఖ్యత తెలుసుకోని ప్రధాని శ్రీశైలం రావడం ఎంతో మంచిదన్నారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 16నెలల్లో దాదాపు 11లక్షల కోట్లు పెట్టుబడి తీసుకురావడం రాబోయే తరాలకు మంచిచేసే విధంగా ఉంటాయన్నారు. ప్రఽధాన మంత్రి టూర్‌లో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పర్యవేక్షిస్తున్నామన్నారు.