కేంద్ర సాయుధ బలగాల కవాతు
ABN , Publish Date - Aug 10 , 2025 | 12:02 AM
శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా శనివారం కేంద్ర సాయుధ బలగాలు కవాతు నిర్వహించారు.
కర్నూలు క్రైం, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి) : శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా శనివారం కేంద్ర సాయుధ బలగాలు కవాతు నిర్వహించారు. నగరంలోని కలెక్టరేట్ నుంచి రాజ్‌విహార్, కిడ్స్ వరల్డ్, పూలబజారు, గాంధీ చౌక్, మించిన్‌బజారు, కాంగ్రెస్ కార్యాలయం మీదుగా కొండారెడ్డి బురుజు వరకు ఈ ర్యాలీ జరిగింది. స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పేందుకే ప్రజలకు ఇబ్బందులు, సమస్యలు ఎదురైతే తక్షణ సాయం అందిస్తామని, రానున్న వినాయకచవితి, స్వాతంత్య్ర వేడుకలు ప్రశాంతంగా జరిగేందుకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ ర్యాలీ ర్యాపిడ్ యాక్షన్ పోర్స్ కమాండెంట్ విజయకుమార్ వర్మ, అసిస్టెంట్ కమాండెంట్ పాపరావు కీర్తి, ఇన్స్‌స్పెక్టర్లు బి.రాజు, భారతి, పట్టణ సీఐలు నాగరాజరావు, శేషయ్య, మన్సూరుద్దీన్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.