Share News

పాఠశాలలో సిమెంటు.. షెడ్డులో వైద్యం

ABN , Publish Date - Aug 14 , 2025 | 12:12 AM

మండలంలోని మదనంతపురం గ్రామ ఎంపీపీ పాఠశాల గదిలో ఓ కాంట్రాక్టర్‌ సిమెంట్‌ బస్తాలు వేసి, గోడౌన్‌గా మార్చారు. దీతో ప్రతి బుధవారం నిర్వహించే 104 సేవలను షెడ్డులోనే కానిచ్చేశారు.

పాఠశాలలో సిమెంటు.. షెడ్డులో వైద్యం
పాఠశాల గదిలో సిమెంటు బస్తాలు .. షెడ్డులో వైద్యపరీక్షలు చేస్తున్న వైద్యులు

మదనంతపురంలో 104 సేవలకు ఆటంకం

మద్దికెర, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మదనంతపురం గ్రామ ఎంపీపీ పాఠశాల గదిలో ఓ కాంట్రాక్టర్‌ సిమెంట్‌ బస్తాలు వేసి, గోడౌన్‌గా మార్చారు. దీతో ప్రతి బుధవారం నిర్వహించే 104 సేవలను షెడ్డులోనే కానిచ్చేశారు. వైద్యాధికారులు శ్రీలక్ష్మి, రాగిణి గ్రామంలో వైద్యసేవలకు వెళ్లగా, గతంలో నిర్వహించే పాఠశాల గదిలో సిమెంటు బస్తాలు దర్శనమిచ్చాయి. అక్కడ అపరిశుభ్ర వాతావరణం ఉండటంతో పాఠశాల గదుల్లో నిర్వహించేందుకు ప్రయత్నించగా తాళం వేసి ఉంది. చేసేదేమీ లేక వైద్యులు వెనుతిరుగుతుండగా గ్రామానికి చెందిన గుంత హనుమన్న అనే వ్యక్తి తన షెడ్డు ఇవ్వడంతో అందులోనే వైద్యశిభిరాన్ని నిర్వహించారు. గ్రామంలో క్లినిక్‌ లేకపోవడంతోనే సమస్య వచ్చిందని, భవనాన్ని నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - Aug 14 , 2025 | 12:12 AM