పత్తి కొనుగోళ్లు ప్రారంభం
ABN , Publish Date - Oct 30 , 2025 | 12:20 AM
గూడూరు మండలం పెంచికలపాడులోని జిన్నింగ్ మిల్లులో మార్కెటింగ్ శాఖ ఏడీఎం నారాయణమూర్తి, కోడుమూరు మార్కెట్ కమిటీ సెక్రటరీ సుందర్‌రాజు, సీసీఐ అధికారులు బుధవారం పత్తి కొనుగోళ్లను ప్రారంభించారు.
కర్నూలు అగ్రికల్చర్, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): గూడూరు మండలం పెంచికలపాడులోని జిన్నింగ్ మిల్లులో మార్కెటింగ్ శాఖ ఏడీఎం నారాయణమూర్తి, కోడుమూరు మార్కెట్ కమిటీ సెక్రటరీ సుందర్‌రాజు, సీసీఐ అధికారులు బుధవారం పత్తి కొనుగోళ్లను ప్రారంభించారు. ఈ సంద్భంగా ఏడీఎం నారాయణమూర్తి మాట్లాడుతూ జిల్లాలోని పెంచికలపాడు, ఎమ్మిగనూరు, ఆదోని, మంత్రాల యం జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోళ్లను ప్రారంభిం చామన్నారు. గురువారం నుంచి సీసీఐ అధికారులు కొనుగోలు చేస్తారని, ముందుగా రైతులు గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాల్లో ఈక్రాప్ నమోదు చేయించి, కాపస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నాణ్యత ప్రమాణాలను అనుసరించి రైతుల నుంచి కొనుగోలు చేఆ్తరని స్పష్టం చేశారు. 8 శాతం లోపు తేమ ఉంటే క్వింటం రూ.8,110లు చెల్లి స్తారని తెలిపారు. రైతులు తప్పనిసరిగా నాణ్యమైన పత్తిని తీసుకురావాలని, గ్రామాల్లో దళారులను నమ్మి తక్కువ మొత్తానికి అమ్ముకోవద్దని సూచించారు.
సీసీఐ పత్తి కొనుగోళ్లు ప్రారంభం
ఆదోని అగ్రికల్చర్, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): పత్తి రైతులను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని మార్కెట్ యార్డ్ చైర్‌పర్సన్ శారద శంకర్ పేర్నొన్నారు. బుధవారం పట్టణ శివారు ప్రాంతంలోని ఎన్‌డీబీఎల్ జిన్నింగ్ పరిశ్రమలో కనీస మద్దతులతో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) పత్తి కొనుగోళ్లను ప్రారం భించింది. ముందుగా ఆమె మార్కెట్ యార్డ్ సెక్రటరీ గోవిందు, పరిశ్రమ యాజమాని బత్తిని కుబేర్‌నాథ్, సీసీఐ ప్రతినిధి శ్రీనివా సులు, వైస్ చైర్మన్ ఆదూరి విజయ్ కృష్ణ, డైరెక్టర్లతో కలిసి పూజలు చేసి ప్రారంభించారు. తుఫాన్ ప్రభావం అధికంగా ఉన్నప్పటికీ పత్తి రైతులు నష్టపోకుండా కనీస మద్దతు ధరతో క్వింటాలు రూ.8,110తో సీసీఐని రంగంలో దించి కొనుగోలు చేస్తున్నామ న్నారు. ప్రభుత్వం సూచించిన విధంగా ముందుగా ఆర్‌ఎస్‌కేలలో తమ వివరాలు నమోదు చేసుకుని కిసాన్ కాపాస్ యాప్‌లో స్లాట్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు. పత్తి తేమ 8 శాతం నుండి 12 శాతం లోపు ఉండాలని అన్నారు. డైరెక్టర్లు వెంకటేష్, రమాకాంత్ రత్నాబాయి, కాశన్న సహాయ కార్యదర్శి శాంతకుమార్, సూపర్‌వైజర్లు రాము, మోహన్ రెడ్డి, షబ్బీర్, భాషా, అశోక్ పాల్గొన్నారు.