నిఘా నేత్రం.. కట్టుదిట్టం
ABN , Publish Date - Jul 14 , 2025 | 12:12 AM
పట్టణంలో ఇటీవల జరిగిన పలు దొం గతనాలు పోలీసులకు సవాలుగా మారాయి. సీసీ కెమెరాల పర్యవేక్షణ లేకపోవడం వల్ల నిందితులను పట్టుకోవడం పోలీసులకు కష్టతరంగా మారింది. దాంతో నేరాల నియంత్రణకు పోలీసుశాఖ కసరత్తు మొదలుపెట్టింది.
నేరాల నియంత్రణకు పోలీసుశాఖ కసరత్తు
ఆత్మకూరు పట్టణంలో 63 సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు
ఆత్మకూరు, జూలై 13(ఆంధ్రజ్యోతి): పట్టణంలో ఇటీవల జరిగిన పలు దొం గతనాలు పోలీసులకు సవాలుగా మారాయి. సీసీ కెమెరాల పర్యవేక్షణ లేకపోవడం వల్ల నిందితులను పట్టుకోవడం పోలీసులకు కష్టతరంగా మారింది. దాంతో నేరాల నియంత్రణకు పోలీసుశాఖ కసరత్తు మొదలుపెట్టింది. అసాంఘిక, అవాంఛనీయ చర్యల నియంత్రణలో భాగంగా సీసీ కెమెరాలతో నిఘా ఉంచేలా ప్రత్యేక దృష్టి సారించింది. పట్టణంలోని అన్ని ప్రధాన రహదారులు, కూడళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లయితే నేరాలను నియంత్రించే అవకాశం ఉండటంతో పోలీసుల ఆదిశగా చర్యలు చేపట్టారు. ఇందుకోసం శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి చొరవతో సుమారు రూ.8లక్షల వ్యయంతో 63 సీసీ కెమెరాలతోను ఏర్పాటు చేయ నున్నారు. ఇందులో కొన్ని స్కానింగ్ కెమెరాలు కూడా ఉన్నాయి. ప్రత్యేకించి నం ద్యాల, కర్నూలు, శ్రీశైలం వంటి ప్రధాన రస్తాలతో పాటు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్, గౌడ్‌సెంటర్, నంద్యాల టర్నింగ్, సంగమేశ్వరం సర్కిల్, పాతబస్టాండ్ తదితర ప్రధాన కూడళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. వీటన్నింటిని ఆత్మకూరు పోలీసుస్టేషన్‌లోని కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేసి ఎప్పటికప్పుడు పోలీసులు నిఘాను కట్టుదిట్టం చేయనున్నారు. వారం రోజుల్లో ఈ పనులన్ని పూర్తిచేసి ఎస్పీ అధిరాజ్‌సింగ్ రాణా, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
సీసీ కెమెరాలతో కట్టుదిట్టమైన నిఘా
ఆత్మకూరులో నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలతో నిఘా ఉంచేలా చర్యలు చేపట్టాం. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి సహకారంతో 63 సీసీ కెమెరా లను ఏర్పాటుచేయనున్నాం. వీటిని కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానంచేసి ఎప్ప టికప్పుడు పర్యవేక్షిస్తాం. వ్యాపారులు, గృహాల యజమానులు, ఇతరసంస్థల తమ వారు సీసీ కెమెరాలను ఏర్పాటుచేసుకుంటే నేరాలను పూర్తిస్థాయిలో నియంత్రిం చొచ్చు. డీ.రాము, అర్బన్ సీఐ, ఆత్మకూరు