Share News

‘పది’లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు

ABN , Publish Date - Aug 16 , 2025 | 12:53 AM

పదో తరగతిలో ప్రతిభ కనబరిస్తే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుం దని విద్యాకమిటీ చైర్మన్‌ మిద్దె రవికుమార్‌, గుంతా రఘు, అన్నారు

‘పది’లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు
హొళగుంద : నగదు ఇస్తున్న వెంకట శివప్రసాద్‌

తుగ్గలి, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): పదో తరగతిలో ప్రతిభ కనబరిస్తే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుం దని విద్యాకమిటీ చైర్మన్‌ మిద్దె రవికుమార్‌, గుంతా రఘు, అన్నారు. శుక్రవారం జొన్నగిరి జడ్పీ పాఠశాలలో గత ఏడాది పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ చూపిన శిల్పకు రూ.2,500, మురళినాయక్‌కు రూ.1,500, శంకర్‌ నాయక్‌కు రూ.1,000 అందించారు.

హొళగుంద: స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో 2024-25 పదదో తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు టీడీపీ నాయకుడు, మిక్కిలినేని వెంకట శివప్రసాద్‌ బహు మతులు అందజేశారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన ఎన్‌.సందేశ్‌కు రూ.50వేలు, ప్రవళికకు రూ.30వేలు, రంజిత్‌ కుమార్‌కు రూ.20వేలు ఇచ్చినట్లు హెచ్‌ఎం కబీర్‌ సాబ్‌ తెలిపారు. చైర్మెన్‌ ద్వారకానాథ్‌, రాజు పొంపన్నగౌడ, వీరన్నగోడ, అబ్దుల్‌ సుభాన్‌ ఉన్నారు.

ఆస్పరి: మండలంలోని బినిగేర గ్రామ విద్యార్థులకు దాత శ్రీనివాస నాయన శుక్రవారం బహుమతులు అందజే శారు. విరుపాపురం జడ్పీ పాఠశాలలో చదివి పాఠశాల ప్రథమ స్థానంలో నిలిచిన పావనికి రూ.14 వేలు, రెండో స్థానంలో నిలిచిన స్వామికి రూ.10వేలు అందజేశారు.

Updated Date - Aug 16 , 2025 | 12:54 AM