Share News

సీసీఐ సీఐపై కేసు

ABN , Publish Date - Aug 22 , 2025 | 12:26 AM

నంద్యాల సీసీఎ్‌సలో పనిచేస్తున్న సీఐ సురేశ్‌ కుమార్‌పై భార్య ఉండగానే రెండో పెళ్లి చేసుకో వడంపై మదనపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.

సీసీఐ సీఐపై కేసు
సురేశ్‌ కుమార్‌

భార్య ఉండగానే రెండో పెళ్లి

ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళతో వివాహం

రెండో భార్య మొదటి భర్త పవన్‌కుమార్‌ ఫిర్యాదు

కేసు నమోదు చేసిన మదనపల్లి పోలీసులు

నంద్యాల టౌన్‌, ఆగస్టు21(ఆంధ్రజ్యోతి): నంద్యాల సీసీఎ్‌సలో పనిచేస్తున్న సీఐ సురేశ్‌ కుమార్‌పై భార్య ఉండగానే రెండో పెళ్లి చేసుకో వడంపై మదనపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు, బాధితుడు పవన్‌కుమార్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పవన్‌ కుమార్‌కు 2018లో కలికిరికి చెందిన సరితతో పెళ్లి జరిగింది. కొన్ని సమస్యల వల్ల విడిపోయి స్థానికంగా సరిత ఫిర్యాదు చేసింది. 2021లో సరిత మదనపల్లి డీఎస్పీ కార్యాలయానికి కేసు పని మీద వచ్చింది. అదే సమయంలో మొలకల చెరవులో సీఐగా పనిచేస్తున్న సురేశ్‌కుమార్‌ డీఎస్పీ కార్యాల యంలో ఆమెను పరిచయం చేసుకున్నాడు. భార్య ఉండగానే నెలలోనే సరితను రెండో పెళ్లి చేసుకు న్నాడు. ఇటీవల ఆమె ఒక బిడ్డకు జన్మనిచ్చింది. సరిత మొదటి భర్త అయిన పవన్‌కుమార్‌ దీనిపై ఎన్నో సార్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయినా వారు పట్టించుకోలేదు. డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో కోర్టును ఆశ్రయించి ఐదు సార్లు విన్నవించుకున్నాడు. కేవలం చిన్న కేసు కట్టి వదిలేశారు. బాధితుడు ఈ సారి ఏకంగా ప్రధానమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేశాడు. దీంతో స్పందించిన పోలీసుశాఖ సీఐపై విచారణకు ఆదేశించింది. దీంతో ఆ సీఐ గత నెల రోజులకు పైగా ఆరోగ్యం బాగాలేదని సెలవు పెట్టి ఎక్కడికో వెళ్లిపోయాడు.

సీఐ క్యాస్ట్‌ సర్టిఫికెట్‌పై కూడా విచారణ

సీఐ సురేశ్‌కుమార్‌ క్యాస్ట్‌ సర్టిఫికెట్‌పై కడప జిల్లా రెవెన్యూ శాఖ విచారణ చేస్తోంది. సీఐ తండ్రి పేరు సుబ్బారెడ్డి, తల్లి నరస సుబ్బమ్మ. వీరిద్దరు కులాంతర వివాహం చేసుకున్నారు. అయితే తల్లి క్యాస్ట్‌ మీద సర్టిఫికెట్లు తీసుకుని సీఐ ఉద్యోగంలో చేరాడు. దీనిపై బాధితుడు ఇటీవల పీఎంవోకు ఫిర్యాదు చేయగా విచారణ చేశారు. ప్రతిచోట అతను ఓసీ అని రాసుకుని కేవలం ఉద్యోగం విషయంలో మాత్రమే వేరే క్యాస్ట్‌(ఎస్సీ) అని రాసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదే క్రమంలో తండ్రి పేరు కూడా సుబ్బారెడ్డి కాస్త సుబ్బయ్యగా మార్చి సర్టిఫికెట్లలోనూ అవకతవకలకు పాల్పడి ఉద్యో గంలో చేరినట్లు ఆరోపణలున్నాయి. ఇటీవల హైకోర్టుకు హాజరైన సమయంలో కూడా తండ్రి పేరు సుబ్బారెడ్డిగా రాశాడు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరుతున్నాడు.

Updated Date - Aug 22 , 2025 | 12:26 AM