Share News

పారిశుధ్య పనులు చేపట్టండి

ABN , Publish Date - May 20 , 2025 | 12:34 AM

నగరంలో పారిశుధ్య పనులను చేపట్టండని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత పారిశుధ్య పర్యవేక్షక సిబ్బందిని ఆదేశించారు.

పారిశుధ్య పనులు చేపట్టండి
మాట్లాడుతున్న మంత్రి టీజీ భరత

రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత

కర్నూలు న్యూసిటీ, మే 19(ఆంధ్రజ్యోతి): నగరంలో పారిశుధ్య పనులను చేపట్టండని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత పారిశుధ్య పర్యవేక్షక సిబ్బందిని ఆదేశించారు. సోమవారం కౌన్సిల్‌ హాలులో కమిషనర్‌ రవీంద్రబాబుతో కలిసి పారిశుధ్య పర్యవేక్షకులు, కార్యదర్శులు, మేస్త్రీలతో కలిసి పారిశుధ్యంపై మంత్రి సమీక్ష నిర్వహిం చారు. మంత్రి టీజీ భరత మాట్లాడుతూ నగరంలో పారిశుధ్యంపై ఫిర్యాదులు ఎక్కువ అయ్యాయని, వాటిపై పర్యవేక్షక సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పారిశుధ్యంలో విశాఖపట్టణం తరహా లో నగరాన్ని తీర్చిదిద్దాలని, అందుకు అవసరమైన చర్యలు తీసు కోవా లని అన్నారు. గార్బేజ్‌ పాయింట్లు లేకుండా చర్యలు తీసుకోవాల న్నారు. రహదారులు, కూడళ్లపై బ్యానర్లు, పోస్టర్లు అతికించే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లలేకపోతే తన వాట్సాప్‌ నెంబరుకు పంపాలని మంత్రి తన నెం బరును పారిశుధ్య పర్యవేక్షలకు ఇచ్చారు. అనంతరం కమి షనర్‌ రవీంద్రబాబు మాట్లాడుతూ పారిశుధ్యం, ఇంజనీరింగ్‌, పట్టణ ప్రణాళిక విభాగాల సిబ్బంది సమన్వయంతో పని చేయాలన్నారు. ఇంటింటి చెత్తసేకరణ వంద శాతం చేపట్టాలన్నారు. రహదారులు, మురుగుకా లువల్లో చెత్తాచెదారం వేస్తే కలిగిఏ అనర్థాలను ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. నగరంలో వేస్ట్‌ ఎనర్జీ ప్లాంట్‌ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. మురుగు కాలు వల్లో ఉన్న తాగునీటి పైప్‌లైన తొలగించేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. కొందరు శానిటరీ సెక్ర టరీలో ఉదయం మస్టర్‌ వేసిన వెంటనే సచివాలయంలో వెళ్లి నిద్రపో తున్నారని తన దృష్టికి వచ్చిందని పద్దతి మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రజారోగ్య అధికారి కె.విశ్వేశ్వరరెడ్డి, శానిటేషన సూప ర్‌వైజర్‌ నాగరాజు, ఇంచార్జి ఎస్‌ఈ శేషసాయి, ఎంఈ సత్యనారాయణ, పట్టణ ప్రణాళిక సర్వేయర్‌ నాగరాజు పాల్గొన్నారు.

Updated Date - May 20 , 2025 | 12:34 AM