రైల్వేగేట్‌ను ఢీకొన్న కారు
ABN , Publish Date - May 13 , 2025 | 12:23 AM
మండలంలోని గుంటూరు-గుంతకల్లు రైల్వే మార్గంలోని గాజులపల్లి రైల్వే స్టేషన్ ప్రధాన రైల్వే గేట్‌ను సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఓ కారు ఢీకొట్టింది
గాజులపల్లి స్టేషన్‌లో అరగంట పాటు నిలిచిన తిరుపతి-గుంటూరు రైలు
నాలుగు గంటలపాటు వాహన రాకపోకలకు అంతరాయం
డ్రైవర్‌పై కేసు
మహానంది, మే 12 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గుంటూరు-గుంతకల్లు రైల్వే మార్గంలోని గాజులపల్లి రైల్వే స్టేషన్ ప్రధాన రైల్వే గేట్‌ను సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఓ కారు ఢీకొట్టింది. పైగా ఆ కారు రైల్వే ట్రాక్‌పై ఆగిపో యింది. దీంతో ఆ మార్గంలో వెళ్లే రైలుకు అంతరాయం ఏర్పడింది. తిరుపతి నుంచి గుంటూరుకు వెళ్లే రైలు నంద్యాల స్టేషన్ దాటిన తర్వాత గాజులపల్లి వద్ద సిబ్బంది గేట్ వేశారు. అయితే కర్నూలు నుంచి వెళ్తున్న కారు గేట్‌ను ఢీకొట్టి రైల్వే ట్రాక్‌పై ఆగిపోయింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది తిరుపతి-గుంటూరు రైలు గాజులపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఆగేలా చర్యలు తీసుకున్నారు. చివరికి రైల్వే సిబ్బంది ట్రాక్‌పై ఉన్న కారును పక్కకు తొలగించి రైలు యథావిధిగా వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. అయితే అర్ధగంట రైలు అరగంట ఆలస్యంగా వెళ్లింది. రైలు గేట్లు దెబ్బతినడంతో లాక్ ఓపెన్ కాలేదు. దీంతో వాహనాలు నిలిచిపోయాయి. ఘటనా స్థలాన్ని నంద్యాల రైల్వే పోలీసులు పరిశీలించారు. మరమ్మతుల అనంతరం ఉదయం 7గంటలకు వాహనాలు బయలుదేరాయి. నాలుగు గంటల పాటు ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కారు డ్రైవర్ విష్ణువర్ధన్‌పై కేసు నమోదు చేసినట్లు రైల్వే పోలీసు లు తెలిపారు. ప్రమాదంలో కారు పాక్షికంగా దెబ్బతింది. ప్రమాదానికి గల కారణాలను రైల్వే పోలీసులు విచారిస్తున్నారు.