Share News

షార్ట్‌ సర్క్యూట్‌తో కారు దగ్ధం

ABN , Publish Date - May 14 , 2025 | 12:31 AM

నగరంలో నంద్యాల చెక్‌పోస్టు సమీపంలో నందికొట్కూరు రోడ్డులో షార్ట్‌ సర్క్యూట్‌తో కారు దగ్ధమైంది.

షార్ట్‌ సర్క్యూట్‌తో కారు దగ్ధం
దగ్ధమవుతున్న కారు

కర్నూలు క్రైం, మే 13(ఆంధ్రజ్యోతి): నగరంలో నంద్యాల చెక్‌పోస్టు సమీపంలో నందికొట్కూరు రోడ్డులో షార్ట్‌ సర్క్యూట్‌తో కారు దగ్ధమైంది. గద్వాల చెందిన దుర్గేష్‌ అనే వ్యాపారి కొడుకు కారు లో ప్రయాణిస్తుండగా.. స్వల్పంగా మంటలు వ్యాపించాయి. దీంతో కారు అక్కడే ఆపేసి పక్కకు వచ్చాడు. వెంటనే కారులో మంటలు వ్యాపించి కారు పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని కారులోని మంటలను ఆర్పేశారు. ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు వ్యాపించి నట్లు అగ్నిమాపక శాఖ అధికారులు తెలుపుతున్నారు.

Updated Date - May 14 , 2025 | 12:31 AM