Share News

31 యేళ్ల తర్వాత వచ్చాడు

ABN , Publish Date - Jun 30 , 2025 | 11:59 PM

తనకు నాలుగేళ్ల వయస్సులో తప్పిపోయానని, తిరిగి తన తల్లిదండ్రుల కోసం ఆదోనికి వచ్చినట్లు వీరేష్‌ అనే యువకుడు తెలిపాడు. యువకుడి కథనం మేరకు.. 31 ఏళ్ల క్రితం తాను ముంబైకి రైలులో వెళ్లి అక్కడే హాస్టల్‌లో ఉండి చదువుకుని పెళ్లి కూడా చేసుకున్నాడు.

31 యేళ్ల తర్వాత వచ్చాడు
సబ్‌ కలెక్టర్‌తో మాట్లాడుతున్న వీరేష్‌

నాలుగేళ్లలో తప్పిపోయానంటున్న యువకుడు

తల్లిదండ్రులను వెతికి పెట్టాలని సబ్‌కలెక్టర్‌కు విన్నపం

ఆదోని, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): తనకు నాలుగేళ్ల వయస్సులో తప్పిపోయానని, తిరిగి తన తల్లిదండ్రుల కోసం ఆదోనికి వచ్చినట్లు వీరేష్‌ అనే యువకుడు తెలిపాడు. యువకుడి కథనం మేరకు.. 31 ఏళ్ల క్రితం తాను ముంబైకి రైలులో వెళ్లి అక్కడే హాస్టల్‌లో ఉండి చదువుకుని పెళ్లి కూడా చేసుకున్నాడు. అయితే తిరిగి తన ఊరు వెళ్లి తల్లిదండ్రులను కలుసుకోవాలని ఎదురుచూస్తూ వచ్చాడు. తన కళ్ల ముందు తల్లిదండ్రులు నాన్నమ్మల పలకరింపులే మెదులుతుండటంతో ఈనెల 26న ఆదోనికి చేరుకున్నాడు. నాన్న పేరు జనార్ధన్‌, నాన్నమ్మ అంజనమ్మ మాత్రమే గుర్తు ఉందని, తన తల్లిదండ్రులను వెతికి పెట్టాలని సబ్‌కలెక్టర్‌ మౌర్యభరద్వాజ్‌కు విన్నవించాడు. తనకు నాలుగేళ్ల వయస్సులో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్తుండగా తప్పిపోయాడు. తాను రైలులు ముంబైకి చేరాడు అక్కడ ఒక వసతిగృహం వారు చేరదీసి చదివించారు. పదో తరగతి వరకు చదిఇ, ఓ హోటల్‌లో పనిచేస్తూ డిప్లొమా పూర్తిచేశాడు. అక్కడే పరిచయమైన మద్రాసుకు చెందిన క్రిస్టెన్‌ ఫ్రాన్సిస్‌ అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పాత జ్ఞాపకాలు గుర్తుకు రావడంతో తల్లిదండ్రులను చూడాలన్న కోరికతో సోమవారం ఆదోనికి చేరుకున్నాడు. తనకు కుడికాలు విరగడంతో చిన్నప్పుడే శస్త్రచికిత్స చేశారని, తల్లిదండ్రులకు తెలుసని అని చెపకొచ్చాడు. అలాగే కుడి కన్ను కణతపై దెబ్బందని, తన తల్లిదండ్రులకు అవి గుర్తున్నాయని ఆంధ్రజ్యోతికి వివరించారు.

Updated Date - Jun 30 , 2025 | 11:59 PM