Share News

ఆమోదం పొందిన పనుల కొట్టివేత

ABN , Publish Date - May 23 , 2025 | 12:59 AM

మండల తీర్మానం బుక్‌లో ఆమోదం పొందిన పనులను కొట్టివేసిన ఎంపీపీపై ఎంపీడీవో జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో జిల్లా పరిషత సీఈవో గురువారం కోవెలకుంట్ల ఎంపీడీవో కార్యా లయంలో విచారణ చేపట్టారు.

ఆమోదం పొందిన పనుల కొట్టివేత
ఎంపీడీవో కార్యాలయంలో విచారిస్తున్న జడ్పీ సీఈవో

ఎంపీపీపై ఫిర్యాదు చేసిన ఎంపీడీవో

విచారణ చేపట్టిన జిల్లా పరిషత సీఈవో

కోవెలకుంట్ల, మే 22(ఆంధ్రజ్యోతి): మండల తీర్మానం బుక్‌లో ఆమోదం పొందిన పనులను కొట్టివేసిన ఎంపీపీపై ఎంపీడీవో జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో జిల్లా పరిషత సీఈవో గురువారం కోవెలకుంట్ల ఎంపీడీవో కార్యా లయంలో విచారణ చేపట్టారు. సీఈవో నాసరరెడ్డి తెలిపిన వివరాలివీ.. గతంలో జరిగిన మండల సమావేశంలో సభ్యులు తీర్మానం చేసి కొన్ని పనులు చేపట్టేందుకు మండల బుక్‌లో ఆమోదం చేశారు. అందులో కోవెలకుంట్ల పట్టణంతో పాటు పలు గ్రామాల్లో మండల గ్రాంటు నిధులతో పనులు చేపట్టడానికి తీర్మానం చేశారు. అయితే కోవెలకుంట్ల పట్టణంలో బనగానపల్లె రహదారిలో పెట్రోలు బంకు సమీపం నుంచి కుందూ వైన్స వరకు రూ.14లక్షలతో డ్రైనేజీ కాలువ పనులను చేప ట్టారు. ఎంపీపీ బీమిరెడ్డి రమాదేవి, మండల పరిషత కార్యాలయానికి వచ్చి మండల తీర్మానబుక్‌ ఇవ్వమని అడగడంతో ఆమోదం పొందిన తీర్మాన బుక్‌ను ఎంపీపీకి ఇచ్చినట్లు ఎంపీడీవో తెలిపారన్నారు. అయితే తీర్మానం బుక్‌ తీసుకుని ఎంపీపీ కొట్టివేసి తిరిగి ఎంపీడీవోకు ఇచ్చారు, ఎంపీడీవో వరప్రసాదరావు తీర్మానం బుక్‌ తెరిచి చూసి ఆమోదం పొందిన పనులను కొట్టివేయడంతో ఈ విషయంపై జిల్లా ఉన్నతాధికా రులకు ఫిర్యాదు చేశారన్నారు. ఎంపీడీవో ఫిర్యాదు మేరకు తాను గురువారం కోవెలకుంట్లకు వచ్చి ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ బీమిరెడ్డి రమాదేవిని, ఎంపీడీవోను, సిబ్బందితో పూర్తిస్థాయిలో విచారణ చేపట్టినట్లు తెలిపారు. అంతేకాక ఏం జరిగిందో వారితో ఓ లిఖితపూర్వక సంజాయిషీ లెటరు రాయించుకున్నామన్నారు. ఈ లెటరును పూర్తి స్థాయిలో చదివి విచారణ చేసి ఆమోదం పొందిన పనులను కొట్టివేసి నందుకు బాధ్యులైన వారిపై పూర్తి స్థాయి విచారించి చర్యలు తీసుకుం టామని ఆయన తెలిపారు.

Updated Date - May 23 , 2025 | 12:59 AM