Share News

విదేశీ ఒప్పందాలను రద్దుచేయాలి

ABN , Publish Date - Aug 14 , 2025 | 12:13 AM

అమెరికా, బ్రిటన్‌ దేశాలతో చేసుకున్న విదేశీ వాణిజ్య ఒప్పందాలను రద్దుచేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కె.వెంకటేశులు డిమాండ్‌ చేశారు.

విదేశీ ఒప్పందాలను రద్దుచేయాలి
నిరసన తెలుపుతున్న రైతు సంఘం నాయకులు

ఆదోని అగ్రికల్చర్‌, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): అమెరికా, బ్రిటన్‌ దేశాలతో చేసుకున్న విదేశీ వాణిజ్య ఒప్పందాలను రద్దుచేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కె.వెంకటేశులు డిమాండ్‌ చేశారు. దేశవ్యాప్త సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపు మేరకు బుధవారం పట్టణంలో రైతు, కార్మిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. పీఎం మోదీ అమెరికా ఎగుమతి దిగుమతి షరతులను అంగీకరించడం సరికాదన్నారు. ఇప్పటికే దేశంలో వ్యవసాయం గిట్టుబాటు కాక చిన్న, సన్నకారు, కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే రైతుల అప్పులను మాఫీ చేసి పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర చట్టాన్ని చేయాలని డిమాండ్‌ చేశారు. క్విట్‌ ఇండియా స్పూర్తితో రైతాంగం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. రామాంజనేయులు, గోపాల్‌, తిప్పన, లక్ష్మణ్‌, రంగస్వామి, బాషా పాల్గొన్నారు.

Updated Date - Aug 14 , 2025 | 12:13 AM