Share News

అభివృద్ధి చేసి ప్రజల ముందుకు వచ్చాం

ABN , Publish Date - Jul 03 , 2025 | 01:05 AM

తాము అభివృద్ధి చేసి ప్రజల ముందుకు వచ్చామని ఎమ్మెల్యే శ్యాంబాబు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని పులికొండ గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు నిర్వహించారు. ఇంటింటికి తిరిగి సంక్షేమం, అభివృదిధని వివరించారు. పింఛన్లను పెంచామని, ఉచిత గ్యాస్‌ సిలిండర్లు, తల్లికి వందనం అమలు చేశామన్నారు.

అభివృద్ధి చేసి ప్రజల ముందుకు వచ్చాం
పులికొండలో ప్రజలతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే శ్యాంబాబు

వైసీపీ పాలనలో అప్పులు, హింసలు తప్ప ఏమీ లేవు

ఎమ్మెల్యే శ్యాంబాబు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి

పత్తికొండ, ఆదోని నియోజవర్గాల్లో ‘సుపరిపాలనలో తొలి అడుగు’

పత్తికొండ, జూలై 2 (ఆంధ్రజ్యోతి): తాము అభివృద్ధి చేసి ప్రజల ముందుకు వచ్చామని ఎమ్మెల్యే శ్యాంబాబు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని పులికొండ గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు నిర్వహించారు. ఇంటింటికి తిరిగి సంక్షేమం, అభివృదిధని వివరించారు. పింఛన్లను పెంచామని, ఉచిత గ్యాస్‌ సిలిండర్లు, తల్లికి వందనం అమలు చేశామన్నారు. ఆగస్టు 15నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామన్నారు. హంద్రీ నీవా కాలువ ద్వారా సాగునీరు అందించేందుకు ప్రభుత్వానికి నివేదికలు పంపామని, గ్రామాల్లో సీసీ రహదారులు, మురగు కాలువలు ఏర్పాటు చేసి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. సాంబశివారెడ్డి, ప్రమోద్‌ కుమార్‌ రెడ్డి, కడవల సుధాకర్‌, బత్తిన లోక్‌నాథ్‌, తిమ్మయ్య చౌదరి, చంద్ర, రంగస్వా మితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడమే ధ్యేయం

ఆదోని: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలపడమే సీఎం చంద్రబాబు ధ్యేయమని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జి మీనాక్షినాయుడు పేర్కొన్నారు. బుధవారం మండలంలోని దిబ్బనకల్లు గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి, సంక్షేమంపై కరపత్రాలను పంపిణీ చేశారు. కురువ కార్పొరేషన్‌ చైర్మన్‌ దేవేంద్రప్ప, నాయకులు భాస్కర్‌రెడ్డి, బసవరాజ్‌, భూపాల్‌చౌదరి, రామస్వామి, శ్రీకాంత్‌రెడ్డి, కృష్ణమ్మ, ఫకృద్ధీన్‌, సర్పంచ్‌ లక్ష్మన్న, ఆరేకల్‌ రామకృష్ణ, బాబునా యుడు, రామచంద్ర, వలమన్న, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్‌చౌదరి పాల్గొన్నారు.

సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయం

తుగ్గలి: సంక్షేమ పథకాలతో పాటు, అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని టీడీపీ కార్యనిర్వహక కార్యదర్శి తుగ్గలి నాగేంద్ర, కార్యదర్శి బత్తిన వెంకట్రాముడు అన్నారు. బుధవారం మండలంలోని రాంపురంలో సుపరిపాలనలో తొలి అడుగు నిర్వహించారు. ఈ కార్యక్రమం తిరుపాల్‌ నాయుడు, వెంకట్రాముడు చౌదరి, వెంకటస్వామి, వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్‌ యాదవ్‌, శ్రీనివాసులుగౌడు, భీమలింగప్ప చౌదరి, మాజీ సర్పంచ్‌ చంద్రన్న, ఎర్రమల్లయ్య, మహ్మద్‌ రఫీ, ఇస్మాయిల్‌, అశోక్‌, మద్దిలేటి చౌదరి, సంఘాల కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 03 , 2025 | 01:05 AM