ప్రశాంతంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష
ABN , Publish Date - Dec 10 , 2025 | 11:42 PM
కర్నూలు జిల్లాలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష బుధవారం ప్రశాంతంగా జరిగింది.
75 మంది అభ్యర్థులు గైర్హాజర్
కర్నూలు ఎడ్యుకేషన్, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లాలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష బుధవారం ప్రశాంతంగా జరిగింది. ఈ పరీక్షలు ఈ నెల 21వ తేదీ వరకు కొనసాగుతాయి. నగర శివా రులోని కేవీ సుబ్బారెడ్డి కళాశాలలోని అయాన్ డిజిటల్ సెంటర్ లోని పరీక్ష కేంద్రాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్‌పాల్ పర్య వేక్షించారు. మొదటిరోజు 665 మంది అభ్యర్థులకు గాను 75 మంది గైర్హాజరయ్యారు. టెట్ ఆన్‌లైన్ పరీక్ష కేంద్రాలను మండల విద్యాశాఖ అధికారులు ఆదాంబాషా, వినోద్ కుమార్, వనజ కుమారి పర్యవేక్షించారు.