క్యాబినెట్ నిర్ణయాలను ఉపసంహరించుకోవాలి
ABN , Publish Date - Jun 21 , 2025 | 12:44 AM
పని గంటలు పెంచి కార్మికుల కడుపు కొట్టి కార్పొరేట్లకు ఊడిగం చేసే తెలుగుదేశం పార్టీ క్యాబినెట్ నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని కేంద్ర, కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
కేంద్ర, కార్మిక సంఘాల డిమాండ్
కర్నూలు న్యూసిటీ, జూన 20(ఆంధ్రజ్యోతి): పని గంటలు పెంచి కార్మికుల కడుపు కొట్టి కార్పొరేట్లకు ఊడిగం చేసే తెలుగుదేశం పార్టీ క్యాబినెట్ నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని కేంద్ర, కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. క్యాబినెట్ నిర్ణయాలకు వ్యతి రేకంగా కేంద్ర, కార్మిక సంఘాల పిలుపుమేరకు శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ఏఐటీయూసీ నగర అధ్యక్షుడు బి.వెంకటేష్, సీఐటీయూ నగర కార్యదర్శి విజయ్ అధ్యక్షతన ధర్నా చేశారు. ఈ సందర్బంగా ఏఐటీ యూసీ, సీఐటీయూ జిల్లా కార్యదర్శులు ఎస్.మునెప్ప, ఎండి.అంజిబా బులు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్‌లను తీసుకువచ్చి కార్మిక హక్కులను కాలరాసింద న్నారు. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకు కూటమి ప్రభుత్వం తన క్యాబినెట్ సమావేశంలో ఎనిమిది గంటల పనివిధానాన్ని 10 గంటలు, 12 గంటలుగా మార్చి కార్మికుల కడుపులు కొట్టేందుకు ప్రయత్నాలు చేస్తుందని విమర్శించారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, స్కీం వర్కర్లకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకుండా రికార్డుల్లో ప్రభుత్వ ఉద్యోగు లుగా చూపించారని అన్నారు. కార్యక్రమంలో ఐఎనటీయూసీ జిల్లా అధ్యక్షుడు బతుకన్న, ప్రభుదాసు, ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి సురేష్ నాయక్, ఏఐటీయూసీ నగర కార్యదర్శి జి.చంద్రశేఖర్, రామాంజనే యులు పాల్గొన్నారు.