కీలక ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం..!
ABN , Publish Date - Jul 25 , 2025 | 12:14 AM
సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం అమరావతిలోని సచివాలయంలో జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో కీలక అంశాలకు చర్చకు వచ్చాయి.
అవుకులో 800 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్
రూ.53 కోట్లతో గోరుకల్లు రిజర్వాయర్ రక్షణ పనులు
డోన్‌లో రెండు పవర్ ప్రాజెక్టులకు గ్రీన్‌సిగ్నల్
నంద్యాల, జూలై 24(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం అమరావతిలోని సచివాలయంలో జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో కీలక అంశాలకు చర్చకు వచ్చాయి. ఈ సమావేశంలో ఉమ్మడి కర్నూలు జిల్లాల్లో జిల్లాలకు పలు కీలక ప్రాజెక్టులకు అమోదం తెలిపి నిధులను కేటాయించారు. సదరు ఆమోదంతో రెండు జిల్లాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉండటంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
అవుకులో 800 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టు
బనగానపల్లె నియోజకవర్గం అవుకు మండలంలోని ఎంఎస్ ఆర్‌వీఆర్ ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడానికి పచ్చజెండా ఊపింది. గురువారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ఆ సంస్థ ఏర్పాటు చేసే పంప్డ్ స్టోరేజీ పవర్ ప్రాజెక్టు నిర్మించేందుకు కేటినెట్‌లో ఆమోదం పొందిం ది. ఈహైడ్రో ఎలక్ర్టిక్ ప్రాజెక్టు అవుకు రిజర్వాయర్‌నుంచి పంపింగ్ ద్వారా నీటిని తోడి ఆ నీటితో విద్యుత్ ఉత్పత్తిని చేసి తిరిగి రిజర్వాయర్‌లోకి నీటిని విడుదల చేసే విధంగా ఈప్రాజెక్టును రూపొందించారు. ఈ పంప్డ్ హౌస్ నిర్మాణం వల్ల 800 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి కానుంది. అవుకు మండలం ఉప్పలపాడు, జూనూతల పరిసర ప్రాంతా ల్లో ఏర్పాటు చేయనున్నారు. 2023 డిసెంబరు 22న 4476.80 కోట్ల వ్యయంతో జలవిద్యుత్ ప్రాజెక్టు పనులపై గతంలో ఓ ప్రైవేటు కంపెనీకి అనుమతి ఇచ్చారు. ఈనేపథ్యంలో 2023లో అవుకు మం డలం ఉప్పలపాడులో పర్యావరణంపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వ హించారు. ప్రభుత్వం మారడంతో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ రద్దు చేశారు. తిరిగి గురువారం కేబినెట్‌లో ఆర్‌వీఆర్ ప్రాజెక్టుకు అనుమతించారు.
డోన్‌లో రెండు పవర్ ప్రాజెక్టులు
కర్నూలు, నంద్యాల జిల్లాలకు ప్రయోజనకరంగా ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వంలో కేబినెట్‌లో డోన్ నియోజకవర్గంలో రెండు పవర్ ప్రాజెక్టులకు కూటమి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇప్పటికే జిల్లా యంత్రాంగం డోన్ నియోజకర్గం ప్యాపిలి మండలం కలచట్ల, కొత్తకోట గ్రామ పరిసర ప్రాంతాల్లో స్ధల సేకరణ చేసి పలు ఆంశా లపై ప్రభుత్వానికి నివేదిక పంపారు. తాజా కేబినేట్ సమావేశంలో ప్యాపిలి మండలం కలచట్ల గ్రామ శివారులో 300 మెగా వాట్లతో విండ్ పవర్ కెపాసిటీ కలిగిన పవర్ ప్రాజెక్టుకు అనుమతించారు. పైగా సదరు ప్రాజెక్టు పనులను సైతం రిన్యూ వ్యోమన్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి అప్పగించారు. ప్రాజెక్టు వ్యయం సుమా రుగా రూ.1,500 నుంచి రూ.1,800 కోట్లు ఉండవచ్చు. ఆ ప్రాజెక్టు పూర్తయితే ప్రతి రోజు ప్రాజెక్టు నుంచి సుమారు 20లక్షల యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. అదే మండల పరిధిలోని కొత్తకోట సమీపంలో 600 మెగావాట్లతో విండ్ పవర్ ప్రాజెక్టుకు అ నుమతించారు. సదరు ప్రాజెక్టు పనులను రిన్యూ విక్రమ్ శక్తి లిమి టెడ్‌కు అప్పగించారు. సదరు ప్రాజెక్టు వ్యయం సుమారు రూ.3 వేల కోట్లు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రతి రోజు సుమారు రూ.40 లక్షల యూనిట్ల విద్యుత్‌ను ఉత్పాదన చేసే అవకాశం ఉంది.
గోరుకల్లుకు రూ.53 కోట్లు
పాణ్యం మండల పరిధిలోని గోరకల్లు రిజర్వాయర్ (నరసిం హరాయసాగర్) రక్షణ పనులకు రాష్ట్ర కేబినేట్ ఆమోదం తెలిపింది. సదరు రిజర్వాయర్ పనులకు సంబంధించి రూ.99 కోట్లతో అధికారులు ప్రతిపాదనలు పంపగా.. రూ.53 కోట్ల నిఽధులకు ప్రభుత్వం అమోదం తెలిపింది. దీంతో రిజర్వాయర్ పరిధిలో రోప్‌బండ్ లెవల్ వరకు మట్టి నిర్మాణం, వర్షపు నీరు సురక్షితంగా విడుదల చేయడానికి డ్రైనేజీ వ్యవస్థ, బండ్ పైభాగం నుంచి గేట్ వ్యవస్థ, 1500 మీటర్ల నుంచి 3,406 మీటర్ల మద్య అప్‌స్ర్టీమ్ వాల్ రక్షణ, గ్యాలరీ మరమ్మతులు, గ్లౌడింగ్, స్లూయిజ్ గేట్ల నిర్మాణం, సెన్సార్ ఏర్పాటు, హెడ్ రెగ్యులేటర్ తదితర పనులను చేయనున్నారు.