Share News

బన్నీ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి

ABN , Publish Date - Sep 26 , 2025 | 11:11 PM

దసరా రోజున దేవర గట్టు మాల మల్లేశ్వరస్వామి ఆలయంలో జరిగే బన్నీ ఉత్సవాలను భక్తులు ప్రశాంతంగా జరుపు కోవాలని కలెక్టర్‌ సిరి అన్నారు.

బన్నీ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ డా.సిరి, పక్కనే ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌

ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తాం

కలెక్టర్‌ సిరి

హింసకు పాల్పడితే చర్యలు : ఎస్పీ విక్రాంత్‌

ఆలూరు/ఆలూరు రూరల్‌, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): దసరా రోజున దేవర గట్టు మాల మల్లేశ్వరస్వామి ఆలయంలో జరిగే బన్నీ ఉత్సవాలను భక్తులు ప్రశాంతంగా జరుపు కోవాలని కలెక్టర్‌ సిరి అన్నారు. శుక్రవారం ఆలూరు నియోజకవర్గంలోని దేవరగట్టు మాల మల్లేశ్వరస్వామి ఆలయంలో ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌తో కలిసి ఆమె ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాలపై పరిసర గ్రామ పెద్దలు, అధికా రులతో వారు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఉత్సవాలకు ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. ఆయా శాఖల అధికారులు అవసరమైన ఏర్పాట్లన్నీ ఉత్సవాలకు రెండు రోజులు ముందే పూర్తిచేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. ప్రతి ఒక్కరూ ఆనందభరితమైన వాతావరణంలో పండు గను జరుపుకోవాలని కలెక్టర్‌ గ్రామస్థులకు పిలుపునిచ్చారు. ఎస్పీ విక్రాంత్‌పాటిల్‌ మాట్లాడుతూ బన్నీ ఉత్సవాలు శాంతియుత వాతా వరణంలో జరుపుకోవాలని సూచించారు. హింసకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. పటిష్టమైన బందోబస్తు, వంద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నా రు. అల్లర్లు సృష్టించే వారిపై నిఘా ఉంచాలని, అగ్గి కాగడాలు భక్తులపైకి విసరకుండా చూ డాలన్నారు. కార్యక్రమంలో ఆదోని సబ్‌కలెక్టర్‌ మౌర్యభరద్వాజ్‌, పత్తికొండ ఆర్డీవో భరత్‌ నాయక్‌, పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ మహేశ్వర్‌రెడ్డి, ఆర్‌ డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ మనోహర్‌, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ సుధీర్‌కుమార్‌, దేవదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ సుధాకర్‌రెడ్డి, డీపీవో భాస్కర్‌, డీఎంహెచ్‌వో శాంతికళ, ఆలూరు తహసీల్దార్‌ శోభాసువర్ణమ్మ, ఎంపీడీవోలు, ఫారెస్ట్‌, ట్రాన్స్‌కో, పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ ఇంజనీర్లు, ఎక్సైజ్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 26 , 2025 | 11:11 PM