బన్నీ ఉత్సవాలు ప్రారంభం
ABN , Publish Date - Sep 27 , 2025 | 10:56 PM
దేవర గట్టు మాళ మల్లేశ్వరస్వామి బన్నీ ఉత్సవం కంకణధార కార్యక్రమంతో శనివారం ప్రారంభమైనట్లు ఆలయ పూజా రులు గిరి మల్లయ్య స్వామి, మహేష్ స్వామి, మనోహర్ స్వామి తెలిపారు.
దేవరగట్టుకు చేరుకున్న ఉత్సవమూర్తులు
హొళగుంద, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): దేవర గట్టు మాళ మల్లేశ్వరస్వామి బన్నీ ఉత్సవం కంకణధార కార్యక్రమంతో శనివారం ప్రారంభమైనట్లు ఆలయ పూజా రులు గిరి మల్లయ్య స్వామి, మహేష్ స్వామి, మనోహర్ స్వామి తెలిపారు. నేరణికి గ్రామంలోని మల్లేశ్వరస్వామి దేవాలయంలోని మాళమ్మా, మల్లేశ్వరస్వామి విగ్రహం ఉత్సవమూ ర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. గ్రామాల్లో పురవీధుల్లో ఊరేగింపుగా దేవరగట్టుపై ఉన్న గిరికి గోరవయ్యలు కంచెవీర బసవరాజు, మద్దిల్లీ మరిమళ్ళ, తీసుకొచ్చినట్లు తెలిపారు. అక్టోబరు 2వ తేదీన బన్నీ ఉత్సవం ఉంటుందని గ్రామస్థులు తెలిపారు. కార్యక్రమంలో కంచ వీర మహేష్ కుమార్, గోరవయ్యలు మెలిగిరి, గిరి, వెంకటేష్, చంద్ర పాల్గొన్నారు.