ముగిసిన బన్ని ఉత్సవాలు
ABN , Publish Date - Oct 06 , 2025 | 11:14 PM
దేవరగట్టు మాళ మల్లేశ్వర స్వామి బన్ని ఉత్సవాలు ముగిసినట్లు సోమవారం ఆలయ నిర్వాహకులు, పూజారి గిరి మల్లయ్య స్వామి తెలిపారు.
నెరణికి గ్రామానికి ఉత్సవమూర్తులు
హొళగుంద, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): దేవరగట్టు మాళ మల్లేశ్వర స్వామి బన్ని ఉత్సవాలు ముగిసినట్లు సోమవారం ఆలయ నిర్వాహకులు, పూజారి గిరి మల్లయ్య స్వామి తెలిపారు. ఈనెల రెండో తేదీన గొలుసు తెంపే కార్యక్రమంతో పాటు కంకణం విసర్జన కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం దేవరగట్టు నుంచి మాళమల్లేశ్వరస్వామి ఉత్సవమూర్తులు నెరణికి గ్రామానికి చేరడంతో ఉత్సవాలు ముగిశాయని, నెరణికి గ్రామంలో ఉత్సవమూర్తులను ఊరేగింపు నిర్వమించి ప్రత్యేక పూజలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హొళగుంద ఎస్‌ఐ గురజాల దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.