అదరగొడుతున్న అన్నదమ్ముళ్లు
ABN , Publish Date - Aug 10 , 2025 | 12:43 AM
: పట్టణానికి చెందిన రాజా, సుమలత దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో సాయిగణేశ్ డిగ్రీ, సాయివిఘ్నేశవ్ ఇంటర్ చదువుతున్నారు.
క్రికెట్ పోటీల్లో రాణిస్తున్న నంద్యాల సోదరులు
ఫ బ్యాటింగ్‌లో ఒకరు.. బౌలింగ్‌లో మరొకరు
ఫ ప్రశంసలు అందుకుంటున్న సాయిగణేశ్, సాయివిఘ్నేశ్
నంద్యాల రూరల్, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): పట్టణానికి చెందిన రాజా, సుమలత దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో సాయిగణేశ్ డిగ్రీ, సాయివిఘ్నేశవ్ ఇంటర్ చదువుతున్నారు. తండ్రి స్థానిక పురపాలక పాఠశాలలో ‘ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. తల్లి గృహిణిగా ఉన్నారు. చిన్నప్పటి బ్యాట్ పట్టుకుని తిరుగుతుండడం గమనించిన తండ్రి క్రికెట్‌లో శిక్షణ ఇప్పించారు. దీంతో వారు చదువుతో పాటు క్రీడల్లో రాణించి జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి స్థానిక శాంతిరాం సంస్థల ఎండీ రఘురాం ప్రోత్సాహంతో స్థానికంగా ఉన్న బెస్ట్ క్రికెట్ ఆకాడమిలో కోచింగ్ తీసుకుంటున్నారు. ఎప్పటికైనా దేశం తరపున ఆడాలన్న ఆశతో నిరంతరం శిక్షణ తీసకుని అటు క్రీడల్లో, ఇటు చదువులో రాణిస్తున్నారు.
బ్యాటింగ్‌లో సాయిగణేశ్ ప్రతిభ
2023లో వెంకటగిరిలో క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన అండర్ -16 క్రికెట్ పోటీల్లో బ్యాటింగ్‌లో ఒక సెంచరీ, మూడు అర్ధ సెంచరీలు సాధించి ప్రశంసా పత్రాలు అందుకున్నాడు.
2023లో అస్సాంలో జరిగిన రాష్ట్ర ప్రాబబుల్స్‌లో బీసీసీఐ డొమెస్టిక్ ఆడి నంద్యాల నుంచి మొదటి క్రికెట్‌ర్‌గా ఘనత సాధించాడు.
2025లో కడపలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన అండర్ -19 క్రికెట్ పోటీల్లో (టెస్టులు) 274 పరుగులు సాధించి బహుమతి అందుకున్నారు.
2025లో విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ఆంధ్ర-బి జట్టులో స్థానం సాధించి 87 పరుగుల తో ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు.
లెగ్ స్పిన్‌తో రాణిస్తున్న సాయివిఘ్నేశ్
2023లో వెంకట గిరిలో జరిగిన అండర్ -16 క్రికెట్ పోటీల్లో 4 టెస్ట్ మ్యాచ్‌ల్లో 14 వికెట్లతో రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు.
2024లో అనంతపురంలో జరిగిన రాష్ట్ర స్థాయి ప్రాబబుల్స్‌లో ప్రతిభ కనబరిచి బహుమతి అందుకున్నారు.
2025లో కడపలో క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన అంతర్ జిల్లాల క్రికెట్ పోటీల్లో మూడు టెస్టుల్లో 17 వికెట్లు తీసీ జట్టు విజయానికి కృషి చేశారు.
2025లో కడపలో జరిగిన క్రికెట్ పోటీల్లో కర్నూలు జట్టు తరపున ఏకంగా ఆరు వికెట్లు తీసి జట్టుకు విజయం అందించి బహుమతి అందుకున్నారు.