Share News

ఉల్లిని గ్రేడింగ్‌ చేసి తీసుకురండి: జేసీ

ABN , Publish Date - Sep 17 , 2025 | 01:04 AM

ఉల్లి దిగుబడులను గ్రేడింగ్‌ చేసి మార్కెట్‌కు తీసుకరావాలని జాయింట్‌ కలెక్టర్‌ నవ్య రైతులకు సూచించారు.

ఉల్లిని గ్రేడింగ్‌ చేసి తీసుకురండి: జేసీ
ఉల్లి రైతులతో మాట్లాడుతున్న జాయింట్‌ కలెక్టర్‌ నవ్య

కోడుమూరు రూరల్‌, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): ఉల్లి దిగుబడులను గ్రేడింగ్‌ చేసి మార్కెట్‌కు తీసుకరావాలని జాయింట్‌ కలెక్టర్‌ నవ్య రైతులకు సూచించారు. మంగళవారం ప్యాలకుర్తి వద్ద రైతు మధుకృష్ణ పొలంలో జాయింట్‌ కలెక్టర్‌ నవ్య, జిల్లా వ్యవ సాయా ధికారి వరలక్ష్మి ఉల్లిపైరును పరిశీలించారు. ఈసందర్భంగా వారు మా ట్లాడుతూ ఉల్లిపంటను కనీసం 120 రోజుల తర్వాతే కోత చేయాలని, ఆ తర్వాత తేమ లేకుండా బాగా ఆరబెట్టి గ్రేడింగ్‌ చేసి మార్కెట్‌కు తర లించాలని సూచించారు. ప్రభుత్వ మద్దతు ధర విషయంలో ఆందోళన చెందొద్దని అన్నారు. అంతకుముందు అధికారులు పత్తి పంటలు పరిశీలించి రైతులతో మాట్లాడారు. తహసీల్దార్‌ నాగరాజు, వ్యవసాయా ధికారి రవిప్రకాష్‌, హార్టికల్చర్‌ అధికారి మదన మోహన ఉన్నారు.

Updated Date - Sep 17 , 2025 | 01:04 AM