నాణ్యమైన ఉల్లిని తీసుకురండి
ABN , Publish Date - Sep 01 , 2025 | 01:05 AM
ప్రభుత్వం ప్రకటించిన ధరను అందుకునేందుకు రైతులు నాణ్యమైన ఉల్లిని కర్నూలు మార్కెట్ యార్డుకు తీసుకురావాలని జేసీ నవ్య పేర్కొన్నారు.
దళారులను నమ్మి మోసపోవద్దు
జాయింట్ కలెక్టర్ నవ్య
కర్నూలు అగ్రికల్చర్, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ప్రకటించిన ధరను అందుకునేందుకు రైతులు నాణ్యమైన ఉల్లిని కర్నూలు మార్కెట్ యార్డుకు తీసుకురావాలని జేసీ నవ్య పేర్కొన్నారు. ఆదివారం కర్నూలు మార్కెట్ యార్డులో అమ్మకానికి తెచ్చిన ఉల్లి రైతులతో జేసీ మా ట్లాడారు. దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. రైతులు అవగాహ నతో పంటల సాగు చేపట్టాలన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తల సూచనలతో ఖర్చులు తగ్గించుకుని అధిక ఉత్పత్తులు సాధించాలన్నారు. ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టం రానివ్వ మని భరోసా ఇచ్చారు. సోమవారం నుంచి కర్నూలు మార్కెట్ యార్డులో నాణ్యమైన ఉల్లికి క్వింటానికి రూ.1,200 చెల్లించి మార్క్‌ఫెడ్ ద్వారా కొను గోలు చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. కార్యక్రమంలో కర్నూలు మార్కెట్ కమిటీ సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ జయలక్ష్మి, ఏడీఎం నారాయణమూర్తి, అసిస్టెంట్ సెక్రటరీ వెంకటే శ్వర్లు, సూపర్‌వైజర్లు కేశవరెడ్డి, శివన్న, నాగేష్, అకౌంటెంట్లు కిషన్ రెడ్డి పాల్గొన్నారు.