రాష్ట్రంలో లంచగొండి రాజ్యం
ABN , Publish Date - Aug 10 , 2025 | 12:01 AM
రాష్ట్రంలో లంచగొండి రాజ్యం నడుస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆరోపించారు.
ఎమ్మెల్యేలు బియ్యం అమ్ముకోవడానికి అంగళ్లు తెరిచారు
జిల్లా సమగ్రాభివృద్ధికి రూ.20 వేల కోట్లు కేటాయించాలి
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ
నగరంలో రెపరెపలాడిన ఎర్రజెండాలు
ఆకట్టుకున్న కళాకారుల గేయాలు, నృత్యాలు
కర్నూలు న్యూసిటీ, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో లంచగొండి రాజ్యం నడుస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆరోపించారు. శనివారం నగరంలోని పాతబస్టాండు అంబేడ్కర్ విగ్రహం వద్ద సీపీఐ జిల్లా 24వ మహాసభలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా జిల్లా పరిషత్ నుంచి కళాకారులు, నాయకులు, కార్యకర్తలతో భారీ ఊరేగింపుగా పాతబస్టాండు వరకు ర్యాలీ నిర్వహించారు. నగరం అంతా ఎర్రజెండాలతో రెపరెపలాడింది. మహాసభలకు జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథులుగా రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సహాయ కార్యదర్శి నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు పి.రామచంద్రయ్య, జగదీశ్, రాష్ట్ర కార్యవర్గసభ్యులు కె.రామాంజనేయులు, ఆవుల శేఖర్, లెనిన్‌బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో 1.47లక్షల రేషన్‌కార్డులు ఉన్నాయని, కూటమి ఎమ్మెల్యే బియ్యం అమ్ముకోవడానికి అంగళ్లు తెరిచారని విమర్శించారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని, జిల్లా సమగ్రాభివృద్ధికి రూ.20వేల కోట్లు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. టీడీపీ-జనసేన పార్టీ నాయకులు రాష్ట్రంలో సుపరిపాలన జరుగుతుందని ప్రచారాలు చేస్తున్నారని, లంచం లేకుండా ఎక్కడ ఏ కార్యాలయంలో పని జరగడం లేదన్న విషయం పాలకులు తెలుసుకోవాలన్నారు. రాష్ట్రంలో ఎన్నడూ, ఎవరూ చేయని విధంగా కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో రూ.1,75,000 వేల కోట్లు అప్పులు చేసిందన్నారు. ఇదే నెలలో రాష్ట్ర మహాసభలు, సెప్టెంబర్‌లో జాతీయ మహాసభలు చండీఘర్‌లో నిర్వహిస్తున్నామన్నారు. కళాకారులు ఆలపించిన గేయాలు, నృత్యాలు పలువురిని ఆకర్షించాయి. వివిద ప్రాంతాల్లోని స్థూపాల నుంచి తీసుకువచ్చిన అరుణ పతాకాలను అతిఽథులకు అందజేశారు. అమరవీరులకు జోహర్లు అర్పించారు. కార్యక్రమంలో మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షుడు కె.జగన్నాథం, సలహాదారుడు భీమలింగప్ప, జే.లలితమ్మ, జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.మునెప్ప, నంద్యాల జిల్లా కార్యదర్శి రంగనాయుడు, మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి శ్రావణిరెడ్డి, రామకృష్ణారెడ్డి, అజయ్‌బాబు, ఏఐఎ్‌సఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, రబిరసూల్, పంపన్నగౌడు పాల్గొన్నారు.