Share News

తల్లి పాలే బిడ్డకు మొదటి వ్యాక్సిన

ABN , Publish Date - Aug 02 , 2025 | 01:10 AM

పుట్టిన బిడ్డకు తల్లి పాలే మొదటి వ్యాక్సిన అని కర్నూలు మెడికల్‌ కాలేజీ ప్రిన్సి పాల్‌ డాక్టర్‌ చిట్టినరసమ్మ అన్నారు.

తల్లి పాలే బిడ్డకు మొదటి వ్యాక్సిన
గర్భిణికి పౌష్టికాహారం అందిస్తున్న ప్రిన్సిపాల్‌, సూపరింటెండెంట్‌

కర్నూలు హాస్పిటల్‌, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): పుట్టిన బిడ్డకు తల్లి పాలే మొదటి వ్యాక్సిన అని కర్నూలు మెడికల్‌ కాలేజీ ప్రిన్సి పాల్‌ డాక్టర్‌ చిట్టినరసమ్మ అన్నారు. శుక్రవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశల గైనిక్‌ విభాగంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా గర్భిణులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ప్రిన్సిపాల్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బిడ్డ పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు ఇవ్వాలన్నారు. హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ కె.వెంకటేశ్వర్లు తల్లి పాల సంస్కృతిని ప్రోత్సాహించాలన్నారు. గైనిక్‌ విభాగపు హెచవోడీ డా.ఎస్‌.సావిత్రి, హాస్పిటల్‌ డిప్యూటీ సూపరిం టెండెంట్‌ డా.డి.శ్రీరాములు, సీఎస్‌ఆర్‌ఎంవో వెంకటరమణ, గైనిక్‌ ప్రొఫెసర్‌ డా.వరలక్ష్మి, అసోసియేట్‌ ప్రొఫెర్‌ డా.ఏ.సుధారాణి, అసి స్టెంట్‌ ప్రొఫెసర్లు పాల్గొన్నారు.

Updated Date - Aug 02 , 2025 | 01:10 AM