సీమ ప్రాజెక్టులను తక్షణమే పూర్తి చేయాలి
ABN , Publish Date - Aug 06 , 2025 | 11:33 PM
రాయలసీమలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను ప్రఽథమ ప్రాధాన్యతగా సత్వరమే పూర్తి చేయాలని విశ్రాంత డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు.
గోదావరి-బనచర్ల ప్రాజెక్టును విరమించుకోవాలి
ఈ ప్రాజెక్టు వల్ల రాయలసీమకు ప్రయోజనం లేదు
విశ్రాంత డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు
కర్నూలు, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): రాయలసీమలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను ప్రఽథమ ప్రాధాన్యతగా సత్వరమే పూర్తి చేయాలని విశ్రాంత డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. రాయలసీమ సాగునీటి సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి నాయకత్వంలో రైతు సంఘం సీనియర్ నాయకులు లక్ష్మీనారా యణ, అక్కినేని భవానీప్రసాద్, రామారావు, నల్లబోతు చక్రవర్తి, ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టుల సాధన కమిటీ అధ్యక్షుడు కృష్ణమూర్తి, సీపీఐ నాయకులు జగన్నాథం, రామాంజనేయులు, రామచంద్రయ్య తదితరులు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని హంద్రీ-నీవా, గోరుకల్లు, బనకచర్ల తదితర ప్రాజెక్టులు సందర్శించారు. సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు, కాలువలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కర్నూలు జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ సీఈ కబీర్‌బాషాను కలసి ప్రాజెక్టులు గురించి అడిగి తెలుసుకున్నారు. ఏఏ ప్రాజెక్టుకు ఎంత నిధులు అవసరం ఉందిణ, ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలను అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం స్థానిక ఎస్టీయూ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాయలసీమ జిల్లాల్లో సరాసరి రూ.4 వేల నుంచి రూ.5వేల కోట్లు ఖర్చు చేస్తే అసం పూర్తి ప్రాజెక్టులు పూర్తవుతాయని, రూ. 6.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఏబీ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కృష్ణా జలాల్లో ఒక్క చుక్క కూడా సీమ ప్రాంతంలో అదనంగా వాడుకోవడం లేదని తెలంగాణ సమాజం గుర్తించాలని, రాజకీ య స్వలాభం కోసం రాజకీయ నాయకుల మాటలను నమ్మి మోసపోవద్దని ఆ యన సూచించారు. గోదావరి జలాలు పం పకాలు సక్రమంగా జరగ లేదని, ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకొని పంపకాలు సక్రంగా చేయాలని సూచించారు. వెలిగొండ సహా శ్రీశైలంపై ఆధారపడిన ప్రాజెక్టుల పూర్తిచేసి ప్రతి ఎకరాకు నీరు ఇచ్చేందుకు ప్రభుత్వం ఖర్చు చేయాలి. కృష్ణా డెల్డాలో చివరి ఆయకట్టుకు సాగునీరు అందడం లేదు. పోలవ రం-బనకచర్ల ప్రాజెక్టు కృష్ణా జలాలు విషయంలో లేనిపోని సమస్యలు తెచ్చి పెట్టే ప్రమాదం లేకపోలేదు అన్నారు. తెలంగాణ కృష్ణాపై కడుతున్న పాలమూరు-రంగారెడ్డి సహా వివిధ ప్రాజెక్టులకు అనుమతులు లేవని, వాటికి అనుమతులు తెచ్చుకోవాలని ఆ రాష్ట్రానికి ఆయన సూచించారు. కేఆర్‌ఎంబీ ఆదేశాలను ఇరు రాష్ట్రాలు పాటిస్తూ నీటి సమస్యలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.