బుక్‌కీపర్ చేతివాటం
ABN , Publish Date - Aug 20 , 2025 | 12:07 AM
మండలంలోని ఓ గ్రామానికి చెందిన వెలుగు బుక్‌కీపర్ పొదుపు మహిళల రుణాల రికవరీ సొమ్మును బ్యాంకుకు చెల్లించకుండా చేతి వాటం ప్రదర్శించాడు.
రూ. పది లక్షలు స్వాహా
ఆందోళనలో పొదుపు మహిళలు
కోవెలకుంట్ల, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఓ గ్రామానికి చెందిన వెలుగు బుక్‌కీపర్ పొదుపు మహిళల రుణాల రికవరీ సొమ్మును బ్యాంకుకు చెల్లించకుండా చేతి వాటం ప్రదర్శించాడు. ఏకంగా పదిలక్షల స్వాహాచేసి గ్రామం నుంచి ఉడాయించాడు. తెలుసుకున్న వెలుగు అధికారులు బుక్‌కీపరుపై నేటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై పొదుపు మహిళలు ఆందోళన చెందుతున్నారు. పొదుపు మహిళల నుంచి స్ర్తీనిధికి సంబంధించి రుణాలను బుక్‌కీపరు నెలనెలా వసూలు చేశారు. బ్యాంకుకు చెల్లించకుండా చేతి వాటం ప్రదర్శించి సుమారు 10లక్షల రూపాయలు బక్కేశారని పొదుపు మహిళలు ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచినా ఉడాయించిన బుక్‌కీపర్ నుంచి డబ్బులు వసూలు చేయించి బ్యాంకుకు కట్టించి తమకు న్యాయం చేస్తారని పొదుపు మహిళలు ఆశగా ఎదురు చూస్తు న్నారు. ఈవిషయంపై వెలుగు సీసీ ఏపీఎం శేఖర్‌ను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా, బుక్ కీపరు చేతివాటం ప్రదర్శించి డబ్బులు నొక్కేసిన మాట వాస్తవమేనని తెలిపారు. అయితే ఇది రెండేళ్లక్రితం జరిగిందన్నారు. అప్పట్లో తాను ఇక్కడ లేనని చెప్పారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు తెలిపి అతడిపై చర్యలు తీసుకుంటా మని ఆయన సమాఽధాన మిచ్చారు.