Share News

మంత్రాలయంలో బాంబు స్క్వాడ్‌ తనిఖీలు

ABN , Publish Date - Apr 27 , 2025 | 12:58 AM

మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠంలో డాగ్‌, బాంబు స్క్వాడ్‌ బృందాలు ముమ్మ రంగా తనిఖీలు చేశారు.

మంత్రాలయంలో బాంబు స్క్వాడ్‌ తనిఖీలు
శ్రీమఠం వద్ద బాంబ్‌, డాగ్‌ స్క్వాడ్‌లతో తనిఖీ చేస్తున్న పోలీసులు

మంత్రాలయం, ఏప్రిల్‌ 26(ఆంధ్రజ్యోతి): మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠంలో డాగ్‌, బాంబు స్క్వాడ్‌ బృందాలు ముమ్మ రంగా తనిఖీలు చేశారు. శనివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు మద్వమార్గ్‌ కారిడార్‌, ప్రధాన రహదారులు, బస్టాండు, నదితీరం, శ్రీమఠం, అన్నపూర్ణ బోజనశాల, మాధవరం, తుంగభద్ర రైల్వేస్టేషన్లలో మంత్రాలయం సీఐ రామాంజులు, మంత్రాలయం, మాధవరం ఎస్‌ఐలు శివాంజల్‌, విజయకుమార్‌ ఆధ్వర్యంలో బాంబు స్క్వాడ్‌ అధికారులు ఆచార్‌, రమేష్‌రెడ్డి, డాగ్‌ స్క్వాడ్‌ అధికారి ప్రసాద్‌తో అను మానం ఉన్న బ్యాగ్‌లు, స్థలాలను డాగ్‌, బాంబు కనుగొనే యంత్రాలతో తనిఖీలు చేశారు. మంత్రాలయం పురవీధులను జల్లెడ పట్టారు. శ్రీమ ఠం అధికారులతో కలిసి భద్రతపై చర్చించారు. మూడు రోజుల క్రితం కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడులకు నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తనిఖీలు కొనసాగాయి. ఈ తనిఖీల్లో వెంకటేశ్వర్లు, రామకృష్ణ, గోపి, జమీర్‌, నాగేశ్వరరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Apr 27 , 2025 | 12:58 AM